Thursday, 1 March 2012

మరచితిరా కంచంలో పడుకున్న రోజులు

ఎంత పని చేశావ్ నారాయణా.. నీకైనా దయ కలగలేదా రాఘవా...సాయమందించమని దూతలను పంపితే ఛాయ్ పోసి ఛల్ చల్ అంటూ వట్టి చేతులతో వెళ్లగొడతరా. ఈ చంద్రుడితోనే పరాచికాలు.  ఒకప్పటి స్నేహబంధాన్నిమరచిపోతారా, మీకిది న్యాయమా. ధర్మమా. అవసరమైనపుడు ఆదుకోకుండా,  క్లిష్ట సమయంలో కిమ్మనకుండా.., బండరాళ్లలా నిలుచుండిపోతారా. మొండి చేయి చూపిస్తారా. అండగా నిలవనంటారా. మరిచిపోయారా నాటి చంద్రయుగపు రోజులు. మీరు మేము.. ఒకే  మంచంలో తిని ఒకే కంచంలో పడుకున్న రోజులు. నా తాళానికి లయ బద్దంగా  దరవు వేసిన రోజులు, నా కరుణా కటాక్షణాల కోసం నిలువెల్లా కనులై వేచిన రోజులు. బళ్లు ఓడలైనంత మాత్రానా, ఏరు దాటాకా తెప్ప తగలెట్టే రకంగా తయారవుతారా. తిన్నింటి వాసాలే లెక్కపెడతారా