పార్లమెంటులో కేసీయార్నీ వయలార్ రవి కలిసిండు
కేశవరావింట్లో టీ కాంగీ ఎంపిలనూ కలిసిండు.
కలిసిన తర్వాత
కేసీయార్, టీ కాంగ్ ఎంపీలు విడివిడిగా సమావేశం పెట్టినా
చెప్పింది ఒకటే పార్లమెంటుకు రాం రాం అని
ఇక్కడెంత అరిచినా ఎవరూ పట్టించుకోవడం లేదు,
హైదరాబాద్ పోతామని కేసీయారూ.
సొంత పార్టీవాళ్లమని చూడకుండా బహిష్కరించారు,
మాకు చానా కోపమొచ్చింది. పార్లమెంటుకు రామని టీ కాంగ్ ఎంపీలు
ఎలా చెప్పినా... కాంగ్రెస్ పెద్దలకు ఇవి తీపి కబుర్లే.
చిత్రం ఏంటంటే కేంద్రమే తెలంగాణ ఇవ్వాలని.. ఢిల్లీలోనే పోరాడాలని,..
గల్లీ పోరాటాలు పనికి రావని చెప్పిన కేసీయారే
ఢిల్లీ నుంచి పలాయనమవ్వడం
అందరినీ కలుపుకొని ముందుకు సాగకపోవడం.