కొందరికి కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులను దాటి పనిచేయరు. దాటాలంటే భయం. అందుకే జీవితమంతా ఆ పరిమితుల్లోపే గడిపేస్తారు. ఇంకొందరుంటారు.వీరికీ పరిమితులుంటాయి. కాని వీరు తమ పరిమితులను తామే నిర్దేశించుకుంటారు. వాటి పరిథిని కూడా తమకు ఇష్టమొచ్చిన రీతిలో మార్చుకుంటూ ఉంటారు. వీరికి భయముండదు. రేపటి గురించి ఆలోచనా ఉండదు. ముందుకు దూసుకుపోవడమే తెలుసు. కష్టమొస్తే ఓర్చుకునే మానసిక శక్తి, ఆనందమొస్తే ఆస్వాదించే గుణముంటాయి వీరిలో. ఇలాంటి వాళ్లే జీవితంలో విజయవంతమవుతారు. పరిమితుల చట్రంలో సంచరించేవాళ్లు, వారెంత మేధావులైనా సరే, విజయానికి ఆమడదూరంలోనే నిలిచిపోతారు.
ఇది ఒక మిత్రుడి చెప్పిన సుభాషితం
ఏకీభవించాలా.. వద్దా.. ఎందుకో మిత్రుడి చెప్పిన మాటల్లో ఎన్నో ప్రశ్నలు కనిపించాయి నాకు, మరి మీకో
ఇది ఒక మిత్రుడి చెప్పిన సుభాషితం
ఏకీభవించాలా.. వద్దా.. ఎందుకో మిత్రుడి చెప్పిన మాటల్లో ఎన్నో ప్రశ్నలు కనిపించాయి నాకు, మరి మీకో
No comments:
Post a Comment