ఏవో చెత్త ఆలోచనలు నా మెదడు చుట్టూ ముసురుకుంటున్నాయి. వాటిని తరిమేయలేక. కీ బోర్డుపై చేతులు కదుపుతున్నాను. అయినా నెగిటివ్ ఆలోచనలు వీడడం లేదు. పాజిటవ్ గా ఉండడమెలా అంటూ చాలా పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాల సారాంశం ఎందుకో వర్కవుట్ అవ్వడం లేదు. ట్రై చేస్తున్నా. వాటి మేజిక్ పనిచేయాలంటే ఇంకో రోజు గడవాలేమో. అయినా కాలం వివిధ సందర్భాల్లో మన మీద వేసే ముద్రల్ని పుస్తకాలతో చెరిపేద్దామనుకోవడం పారపాటేమో. ఏడ్వాలనుకున్నప్పుడు ఏడుస్తాం గానీ నవ్వలేం. నవ్వాలనుకున్నప్పుడు ఎంత గింజుకున్నా ఏడుపురాదు. కష్టమొస్తే బాధపడాలి ఆనందం వస్తే గంతులేయాలి. పుస్తకాలు చదివాం కాబట్టి ఏడుపొచ్చినప్పడు నవ్వమంటే నవ్వలేం. పిరికితనం ఆవహించిన వేళ ధైర్యంగానూ ఉండలేం. తప్పదు కొన్ని నిమిషాలైనా, కొన్ని క్షణాలైనా, భావోద్వేగాలు మనతో బాస్కెట్బాల్ ఆడుకుంటాయి. లేకపోతే ముత్యాల ముగ్గులో రావుగోపాల్రావన్నట్లు మనిసికి గొడ్డుకి తేడా ఏముంటుంది.
No comments:
Post a Comment