Saturday, 21 September 2013

మోడి ఎక్కడా. వాజపేయి ఎక్కడా



రాములోరి పార్టీతో ఎన్టీవోడి పార్టీ  జత కడితే ఎలా ఉంటాదంటావ్
ఆళ్లు దూరమైపోతారేమోరా
ఛస్.. ఆళ్లేవరేయ్ అళ్లు దూరమైతే  కొంపలు మునిగిపోతయేటి
మునగడం సంగతి తెల్ద గానీ..ఓ పాలి ఓడిపోనాం..నీకు గుర్తు నేదేటి
నేకేం.. అందుకాళ్లేనేటి కారణం..
ఆళ్లేరా బాబూ... అందుకే ఓడిపోనాం.

ఐతే మరో పాలి దోస్తీ కట్టి గెల్లేదేటీ
అప్పడు వాజపేయి గోరున్నారు అందుకే..
మరిప్పడు మోడీ బాబు గోరు లేరేటి
బాగుంది మోడి గోడి ఎక్కడా, వాజపేయి గోరెక్కడా
నక్కకి కుక్కకి ఉన్నంత తేడా ఉందిరా బాబూ
నాకలా అనిపించడం లేదు
ఇటు రాముడు... అటు ఆంజనేయుడు

ఛస్.. నువ్వు  మరీ ఒఠ్టి ఎర్రిబాగులోడివిరా
మోడి మీద ఎలాంటి ముద్దరుందో నీకు తెలుసునా
ఎలాటిదేటీ. ఐనా ఉంటే ఏటి ఓట్లేయరేటీ
ఎన్ని సెప్పు ఆడితో జోడి కత్తి మీద సామురా బాబూ
మరి సాము చేయకుండా వచ్చేద్దేటి అధికారం

ఒరేయ్ మనలో మనకి గొడవలెందుగ్గానీ..
బాబు గోరి దగ్గరికెళదాం పద
యింటారంటావా
తస్సాదియ్యా నీకన్నీ అనుమానాలే.
బాబు గోరు చాణక్యుడు

No comments:

Post a Comment