Saturday, 21 September 2013

సచివాలయంలో శవాల కంపులో


తెలుగుజాతికి 2 రాష్ర్టాలు
టీవీలో స్క్రోలింగ్

ఆయోమయం ఆఫీసరు
టూ ఎందుకు త్రీ అంటూ 
నాలుగు వేళ్లు చూపిస్తున్నాడు

ఆర్టీసీ కార్మికుడి వైపు
కేశినేని, దివాకర్ 
తీక్షణంగా  చూస్తున్నారు 

విడిపోతే పడిపోతమంటూ
ఊగిపోతున్నడో  గజల్ గాయకుడు 
అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామంటూ 
తెలుగుతల్లి విగ్రహం  ముందు  ఓ  ఉద్యమకారుడు
ట్యాంక్ బండ్ పై విగ్రహాలు ఒక్కసారిగా వణికాయ్


ఒక్కటిగా ఉంచండి... ఓట్లు లేకపోతే నోట్లు
బేరం పెట్టాడు ఓ నాయకుడు

రెండుగా విడగొట్టండి.. ఢిల్లీ పీఠం..కొడుక్కి పట్టం
ఎదురు బేరం పెట్టాడు మరో నాయకుడు



అమ్మగారి ముందు  ఆ ఇద్దరు  నాయకులు
చేతులు కట్టుకొని... తలల వంచుకొని 
నిలబడ్డారు.
కత్తితో  కొడుకు సిద్ధంగా ఉన్నాడు
అమ్మ ఇంకా లెక్కలు వేస్తూనే  ఉంది

హైదరాబాదు బస్సు ఎక్కాలా లేదా అని
శ్రీకాకుళంలో  అప్పలనాయుడు
బస్టాండులో  గిరగిరా తిరుగుతున్నాడు
ఇమ్లిబన్లో  అతడి కొడుకు కూడా

ఫార్మ్ హౌస్లో మెత్తటి  సోఫాలో
కొడుకు,కూతురు,అల్లుడు 

జైల్లో.. లోటస్ పాండులో
భార్య, తల్లీ, చెల్లీ

వైస్రాయ్లో, 22లక్షలింట్లో
కొడుకు కోడలు, బామ్మర్ది

సచివాలయంలో.. శవాల కంపులో
మరికొందరు

అప్షన్లపై కసరత్తు చేస్తున్నారు.












 




 









No comments:

Post a Comment