కంచిలో దండేస్తారని కాళహస్తి నుంచి
ఒంగోని పొయాడట వెనకటికి ఒకాయన.
ఇవన్నీ చూసిన తర్వాత
అలానే ఉంది ఇప్పడు బాబు యాత్ర గానీ,
జగన్ పార్టీ తలపెట్టబోతున్న యాత్ర గానీ,
ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట గానీ.
2014 ఎన్నికల లక్ష్యంగానే
వీళ్లంతా యాత్రలు చేస్తున్నారు.
యాత్రలే ఎందుకు చేస్తున్నారంటే
ఇదిగో ఈ కింది కారణాలు వారికున్నాయ్
2004 ఎన్నికలకుముందు
వైఎస్ పాదయాత్ర చేశాడు.
అధికారంలోకి వచ్చాడు.
అద్వానీ రధయాత్ర చేశాడు.
రెండు సీట్లున్న కమలానికి
అధికారం అందించాడు
1983లో ఎన్టీయార్ చైతన్యరథంపై తిరిగాడు.
విజయబావుటా ఎగరేశాడు
మొన్నటికి మొన్న ములాయం కొడుకు
సైకిల్ యాత్ర చేశాడు. పగ్గాలు చేపట్టాడు.
ఇవన్నీ చూసిన తర్వాత
యాత్రలకు అధికారం రాలుతుందని
నమ్మకం ఏర్పడింది నాయకులకు
ఆ నమ్మకమే 63 ఏళ్ల చంద్రబాబును నడిపిస్తోంది.
ఆ నమ్మకం జైలుకు వెళ్లకముందు యువ జగన్ను నడిపించింది.
ఐతే ఇక్కడ ప్రశ్నేంటంటే ఎవరి యాత్రకు అధికారం రాలుతుందనేదే
ఇప్పటికే చంద్రబాబు యాత్రకు రూ. 100 కోట్లు ఖర్చని వార్తలొచ్చాయి.
రేపు జగన్ పార్టీ చేసినా అంతే అవుతుంది.
ఇంత ఖర్చు చేసినా రేపు ఫలితం దక్కకపోతే...
ఎవరికెక్కవ నష్టం.
చంద్రబాబుకా, జగన్ పార్టీకా
No comments:
Post a Comment