ప్రతిపక్ష నాయకులను నియంత్రించడానికి
కాంగ్రెస్ వేసే వెధవ్వేషాలు అందరికీ తెలిసిందే.
ఎప్పటిదో ఐఎమ్జీ భూముల కేసు.
దాన్ని తేల్చరు, నాన్చరు.
రాజకీయంగా అవసరం లేనపుడు
ఐఎమ్జీ పై మౌనంగా ఉండే కాంగ్రెస్
తేడా వస్తే, అదిగో సీబీఐ అంటూ
భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.
సీబీఐ నోటీసులు కూడా చిత్రంగా విడుదలవుతుంటాయి
నిన్న మాయావతి యూపీలో బహిరంగ సభ పెట్టి
ఎఫ్డీఐలకు వ్యతిరేకమని చెప్పింది.యూపీఏపై పోరాడతమంది.
వెంటనే అక్రమాస్తుల కేసులో సీబీఐ నోటీసులు పంపింది.
యూపీ గవర్నర్ ఆమోదం తెలిపితే
మాయాపై సీబీఐ దర్యాప్తు మొదలవుతుంది.
చిత్రమేంటంటే అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న
లాలూ,ములాయం ఊసు మాత్రం ప్రస్తుతానికి ఎత్తదు సీబీఐ
మొన్న గడ్కరీ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు
ఇంత గందరగోళమున్నా
ఎందుకు యూపీఏ పడిపోవడం లేదంటే
ప్రభుత్వాన్ని ఒకే ఒక వ్యక్తి కాపుకాస్తున్నాడని చెప్పాడు.
ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే సీబీఐ డైరెక్టరట.
Nooru godlanu tinna rabhandu kuda oke oka gali vanaku kottuku poyindata.2014 lo ee congress kuda anthe.Amma Amma ani pilupinchukune a bomma kuda italiki chekkesi roju tvara lone vastundi
ReplyDelete