Saturday, 9 June 2012

దొంగే దొంగను దొంగంటే..

దొంగే దొంగనుదొంగంటే..

నమ్మడానికి కూసింత ఆలోసిత్తాం.

అదే ఏ మంచోడో అన్నాడనుకోండి.

నిజమేరా... ఆడు దొంగేరా అనుకుంటాం.

కానీ దొంగే దొంగను దొంగంటే.

కాసింత అనుమానం పడతాం.

ఏటి కత అని ఆరా తీస్తాం.

ఆడు దొంగే.. ఈడూ దొంగే అని తేలితే

అందులో మంచిదొంగ ఎవడని సూత్తాం.

నాను సెప్పినదానికి ఊ అంటారా

ఉలిక్కిపడతారా.


No comments:

Post a Comment