Monday, 24 December 2012

బావా.. అదిగో మోడీ పురి, అదిగో అధికారం

బావా.. అదిగో మోడి పురి. 
అదిగో  2014లో మన అధికారానికి సాయపడే కాషాయదళం
అదిగో  సదా మన సేవలోనే  తరించే వెంకయ్య నాయుడు
అదిగో మన మేలు కోరే పెద్దాయన అద్వాని
అదిగో మనకు ఓట్లు తెచ్చే లడ్డూ నరేంద్రభాయ్ 
అదిగో 99లో మన వెంట నడిచిన నాయకగణం

వెళ్లమందువా బావా,  మోడీ పురి వెళ్లమందువా
వెళ్లి  నాటి చెలిమిని మళ్లీ ఓ సారి గు్తు చేయమందువా
చేసుకున్న బాసలు చెరిగిపోవనీ,
అధికారంపై శలు మెండుగా ఉన్నవనీ,
2014లోని మనతోనే నడవమనీ
కాషాయం, పసుపు ఒకటేననీ,.
ఎన్నటికీ విడిపోని జంట మనదేననీ
లౌకికవాదం ఓ ముసుగేననీ.
అధికారమే పరమావధి అనీ

నీ మాటగా వారికి చెప్పి,
రమ్మందువా బావా. 
 






No comments:

Post a Comment