ఏరా స్కూలుకు ఎందుకు రాలేదు
కడుపులో నొప్పి మేడం.
ఏం దేవేందర్. చిల్లరచర్చలో
ఓటేందుకెయ్యలేదు
ఒంట్లో నలతగా ఉంటేనూ..
అయినా బాబు గారికి లీవు లెటరిచ్చానే, మీకివ్వలేదా.
సుధా నీ సంగతి
మా ఇంట్లో వాళ్లకు వంట్లో బాలేదు. అందరికీ జొరం. నిజ్జెం
చౌదరి నీకేం పోయే కాలం.
వేళకి పోయే విమానం దొరకలేదు. అమ్మతోడు... దొరికుంటేనే..
నమ్మాలి, కట్టుకథలు నమ్మాలి,
దేశానికి నిలువు నామాలు పెట్టే వాళ్లనీ,
చిల్లరపనులు చేసి పెద్దలుగా చెలామణీ అయ్యేవాళ్లనీ,
ప్రజాస్వామ్యాన్ని టోకున బేరం పెట్టేవాళ్లనీ
నమ్మాలి. అయినా నమ్మితే పోయేదేముంది.
No comments:
Post a Comment