తోడు దొంగలు సినిమా చూశారా
ఇద్దరు దొంగలుంటారు.
కలిసే దొంగతనాలు చేస్తా ఉంటారు
దోచుకున్నదీ కలిసే పంచుకుంటా ఉంటారు.
ఏంటీ చూడలేదా. చూశారుగానీ.
కథ అలా ఉండదంటారా
ప్చ్... సినిమా పేరలా ఉంది కాబట్టి
కథా అలానే ఉంటుందనుకున్నా
అడ్డం తిరిగినట్టుంది.
పోనీ అఖిలపక్షం నాటకం ఎప్పడైనా చూశారా
ఢిల్లీలో ఆడతా ఉంటాది. హోం మంత్రి ఆడిస్తా ఉంటాడు
ఒక్కో పార్టీ తరఫున ఇద్దరు వెళతా ఉంటారు.
వెళ్లిన ఇద్దరూ వేర్వేరు మాటలు చెబుతా ఉంటారు. అయినా
పక్కపక్కనే కూర్చోని కుళ్లు జోకులేసుకుంటా ఉంటారు.
నాటకం ఆడించేవాళ్లు కూడా ఆ జోకులకు
విరగబడి నవ్వుతూ.. తెర దించేస్తా ఉంటారు.
చూడ్లేదా... 28న మళ్లీ మీ కోసం వేస్తున్నారు.
నాటకం పేరు; షిండే వాకిట్లో తెలంగాణ చెట్టు
చిరునామా, నార్తు బ్లాకు. న్యూఢిల్లీ
No comments:
Post a Comment