Saturday 3 December 2011

విశ్వాసానికి ఖరీదుకట్టే షరాబులు కావాలి

కుక్కలకు విశ్వాసం ఉంటుంది. మరి మనషులకో.  ఉంటుందని చెప్పలేం.  రాజకీయ నాయకుల విషయంలోనైతే  శషభిషలే అక్కర్లేదనుకోండి. విశ్వాసాలను అవలీలగా మార్చేస్తుంటారు. నిన్నటివరకు జగన్ పంచనున్న వారు నేడు కిరణ్ పంచెలోకి దూరుతున్నారు. దూరడానికి ఏ పంచె లేని వారు పాపం చిరంజీవిని నిలదీస్తున్నారు. అయినా మెగాస్టారు మాత్రం  ఏం చేస్తారు. తన సౌఖ్యం తాను చూసుకున్నారు.  అందరిదీ చూడ్డానికి ఇదేమైనా సినిమానా. రాజకీయం. మా వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. అసంత్రుప్తితో ఉన్నారు.. ఇలా ఒకట్రెండు మాటలు చెప్పడం మినహా  తన వెంట నడిచిన వారికి గట్టిమేలు తలపెట్టే కార్యదక్షుడు కాదని ఇంతకుముందే నిరూపితమైంది. కాబట్టి పీఆర్పీ వాళ్లకు కూడా కొత్తగా బాసు మీద కొండంత ఆశలేమీ లేవు.  కానీ విశ్వాస పరీక్ష సమయంలో విశ్వాసంగా పడి ఉంటడానికైనా  ఖరీదు కట్టే షరాబు దొరుకుతాడనే ఓ చిన్న ఆశ. మరి ఆ ఆశను ఎవరు తీరుస్తారు?

No comments:

Post a Comment