Thursday 11 October 2012

ఎవరికి ఎక్కువ నష్టం. బాబుకా, జగన్కా

కంచిలో దండేస్తారని కాళహస్తి నుంచి 
ఒంగోని పొయాడట  వెనకటికి ఒకాయన. 
అలానే ఉంది ఇప్పడు బాబు యాత్ర గానీ, 
జగన్ పార్టీ తలపెట్టబోతున్న యాత్ర  గానీ, 
ముఖ్యమంత్రి  ఇందిరమ్మ బాట గానీ. 


2014  ఎన్నికల లక్ష్యంగానే
వీళ్లంతా యాత్రలు చేస్తున్నారు.
 యాత్రలే ఎందుకు చేస్తున్నారంటే
ఇదిగో ఈ కింది కారణాలు వారికున్నాయ్


2004 ఎన్నికలకుముందు 
వైఎస్ పాదయాత్ర చేశాడు. 
అధికారంలోకి వచ్చాడు.

అద్వానీ రధయాత్ర చేశాడు.
రెండు సీట్లున్న కమలానికి 
అధికారం అందించాడు

1983లో ఎన్టీయార్ చైతన్యరథంపై తిరిగాడు.
విజయబావుటా ఎగరేశాడు

మొన్నటికి మొన్న ములాయం కొడుకు 
సైకిల్ యాత్ర చేశాడు. పగ్గాలు చేపట్టాడు.

ఇవన్నీ చూసిన తర్వాత
యాత్రలకు అధికారం రాలుతుందని 
నమ్మకం ఏర్పడింది నాయకులకు

ఆ నమ్మకమే 63 ఏళ్ల చంద్రబాబును నడిపిస్తోంది.

ఆ నమ్మకం జైలుకు వెళ్లకముందు యువ జగన్ను నడిపించింది.

ఐతే ఇక్కడ ప్రశ్నేంటంటే  ఎవరి యాత్రకు  అధికారం రాలుతుందనేదే

ఇప్పటికే చంద్రబాబు యాత్రకు రూ. 100 కోట్లు ఖర్చని వార్తలొచ్చాయి.

రేపు జగన్ పార్టీ చేసినా అంతే అవుతుంది.

ఇంత ఖర్చు చేసినా  రేపు ఫలితం దక్కకపోతే...  

ఎవరికెక్కవ నష్టం.

చంద్రబాబుకా, జగన్ పార్టీకా 






Tuesday 9 October 2012

ఎన్నాళ్లని చంద్రబాబును హింసపెడతారు


ప్రతిపక్ష నాయకులను నియంత్రించడానికి
 కాంగ్రెస్ వేసే వెధవ్వేషాలు అందరికీ తెలిసిందే.

ఎప్పటిదో ఐఎమ్జీ భూముల కేసు. 
దాన్ని తేల్చరు, నాన్చరు.

రాజకీయంగా అవసరం లేనపుడు  
ఐఎమ్జీ  పై మౌనంగా ఉండే కాంగ్రెస్
తేడా వస్తే, అదిగో సీబీఐ అంటూ
భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.

సీబీఐ నోటీసులు కూడా చిత్రంగా  విడుదలవుతుంటాయి

నిన్న మాయావతి యూపీలో బహిరంగ సభ పెట్టి  
ఎఫ్డీఐలకు వ్యతిరేకమని చెప్పింది.యూపీఏపై పోరాడతమంది. 
వెంటనే అక్రమాస్తుల కేసులో సీబీఐ నోటీసులు పంపింది.

యూపీ గవర్నర్ ఆమోదం తెలిపితే
మాయాపై సీబీఐ దర్యాప్తు మొదలవుతుంది. 

చిత్రమేంటంటే అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 
లాలూ,ములాయం ఊసు మాత్రం  ప్రస్తుతానికి ఎత్తదు సీబీఐ


మొన్న గడ్కరీ  ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు
ఇంత గందరగోళమున్నా 
ఎందుకు యూపీఏ  పడిపోవడం లేదంటే
ప్రభుత్వాన్ని ఒకే ఒక వ్యక్తి కాపుకాస్తున్నాడని చెప్పాడు.

ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే సీబీఐ డైరెక్టరట.



Monday 8 October 2012

వాద్రా ప్రైవేటు పౌరుడైతే.. జగన్ ఏమవుతాడు

డీఎల్ ఎఫ్  ప్రభుత్వం నుంచి భూములు తీసుకుంది 
సోనియా గాంధీ అల్లుడికి కారుచౌకగా తన ఆస్తులను కట్టబెట్టింది.


నిమ్మగడ్డ అండ్ కో  ప్రభుత్వం నుంచి సాయం పొందింది. 
తర్వాత రాజశేఖరరెడ్డి కొడుకు జగన్కు సంబంధించిన సంస్థల్లో
చాలా తక్కువ ప్రీమియంకే షేర్లు కొనుగోలుచేసి పెట్టుబడులు పెట్టాయి. 

రెండింటికి తేడా ఏంటో చిదంబరం సారే చెప్పాలి. 

ఒకరిని అవే ఆరోపణలపై జైల్లో పెట్టినప్పడు.. 
మరోకరిపై కనీసం దర్యాప్తు కూడా చేయమని తెగేసి చెప్పడమేంటి








Saturday 6 October 2012

ఆరోపణలపై ఆరోపణలు చేయరట

అధికారం కావాలి.కానీ అధికార పక్షాన్ని ఏమీ అనరట. ఎంత సిత్రం చూడండి. కేజ్రీవాలా అన్న ఓ వ్యక్తి వాద్రాపై ఆరోపణలు చేస్తే.. వాటిలో నిజమెంతో అబద్దమెంతో తేల్చాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండు చేయడం మానేసి..  కేజ్రీవాలావి  ఆరోపణలే... అందుకే వాటిపై బీజేపీ పెద్దగా స్పందించ లేదని గడ్కరీ  ఐబీఎన్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ కు మిత్రులకు కొరతలేదన్నవిషయం అర్థమవుతుంది.



ఇప్పటికే  మహారాష్ట్ర ఇరిగేషను స్కీము స్కాములో గడ్కరీ పేరు మునుగుతూ తేలతా ఉంది.  కాంగ్రెసోళ్లు కూడా  గడ్కరీపై  గట్టిగా దాడి చేయడం లేదు. అందుకు ప్రతిఫలంగానే  గడ్కరీ సాబ్.. వాద్రా ఘటనపై మౌనంవ్రతం పాటిస్తున్నారన్న గుసగుసలూ ఉన్నాయి. నిజం పెరుమాళ్లకెరుక


Friday 5 October 2012

జగన్ జైల్లో ఉంటే.. వాద్రా ఎక్కడుండాలి

రాజశేఖరరెడ్డిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించాడన్న ఆరోపణలపై జగన్ జైల్లో ఉన్నాడు.
సోనియాగాంధీని అడ్డంపెట్టుకొని అల్లుడు వాద్రా సంపాదించాడని ఇప్పడు ఆరోపణలు వస్తున్నాయి.
మరి అల్లుడు వాద్రా ఎక్కడుండాలి.
నిజానికి వాద్రాపై కేజ్రీవాలా ఆరోపణలకు కొత్తవి కావు.
ఏడాది క్రితమే డీఎల్ఎఫ్-వాద్రా మిలాఖాత్పై టైమ్స్ ఆఫ్ ఇండియా  కథనాలు ప్రచురించింది.
ఎవరూ పట్టించుకోలేదు. ప్రతిపక్షమైన బీజేపీ కూడా మౌనందాల్చింది.
ఇప్పడు కేజ్రీవాలా మళ్లీ  అవే ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది.
అయితే ఇప్పడు ప్రశ్నల్లా ఆరోపణలపై విచారణ జరుగుతుందా అనేదే
ఎందుకంటే దేశానికి న్యాయశాఖ మంత్రి అయిన ఖుర్షీద్ గారు...
టీవీ ఛానళ్ల ముందు సోనియాగాంధీ కుటుంబానికి వకీల్లా మాట్లాడారు.
న్యాయశాఖమంత్రిగా ఆరోపణలపై విచారిస్తామని చెప్పాల్సింది పోయి
 అమ్మగారి కుటుంబంపై ఈగ వాలితే సహించమన్న రీతిలో  మాట్లాడడం చూస్తుంటే
అల్లుడిగారిపై విచారణ జరుగుతుందనుకోవడం భ్రమలానే కనబడుతోంది.