కోపమొచ్చింది. మరి రాదా. 70 శాతం మెక్కిన రాజకీయ నాయకులు సుఖంగా బయట ఉన్నారు. 30 శాతానికి కక్కుర్తిపడ్డ అయ్యా ఎస్ లేమో ఉచలు లెక్కపెడుతున్నారు. అందుకే మండిపోయారు. సమావేశం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని కలిశారు. ఏంటిదంతా అంటూ నిలదీశారు. ఏమీ లేదు. అంతా హంబక్. నేనున్నాగా చూసుకుంటా. మీకేమీ కాదు. ఆ 30 కాకపోతే మరో పది ఎక్కువగా తీసుకోండి. ఆ హామీ కూడా సంత్రుప్తినివ్వలేనట్లుంది.. ప్రధానమంత్రిని కలుస్తారట. మా వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు లోపలికి పోతున్నారు. మీ వాళ్ళ్లు ఒక్కరూ వెళ్లలేదు. అన్నాయం.. ఈ తొండి ఆటను మేం ఒప్పుకోమని వినతిపత్రమిస్తారట. మరి ప్రధాని ఏం సమాధానం ఏం చెబుతారో. రాజాను లోపలికి నెట్టి చిదంబరంపై చీమను కూడా వాలనీకుండా కాపలా కాస్తున్న మన్మోహన్ ఏ హామీ ఇస్తాడో.
No comments:
Post a Comment