అంతా సవ్యంగా ఉందని చెప్పినా నమ్మకపోతే ఎలా
అందరితోనూ మంచి సంబంధాలున్నాయన్నాయని నమ్మకంగా చెప్పినా నవ్వితే ఎలా
ఎందుకు ఈ అనుమానపు చూపులు. ఎందుకీ డేగకళ్ల పహారా
చెప్పిన మాట నమ్మరు. నమ్మినట్టు నటిస్తూ నిలదీస్తారెందుకు
నిజం మీకు కావాలా, అబద్దం మీరు ఇష్టపడతారా.
ఏం చెప్పినా ఏదో ఓక వాదానికి ముడిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు.
అర్థం పర్థం లేనిది నా హ్రుదయం.. వదిలేయండి.
పట్టుకు వేలాడడం వల్ల మీ విలువైన సమయం గంగలో
ఆలోచించండి. నా మాటలపై వారథులు కట్టే ప్రయత్నం చేయకండి.
అవి ఎక్కడికీ తీసుకుపోవు. నుంచున్న చోటు చాలు నాకు.
ప్రపంచమంతా మీదే. హాయిగా తిరగండి. చూడండి. నన్ను వదిలేయండి.
నా మాటలను నాకు. నా అభిప్రాయాలను నాకు, నా హ్రుదయాన్ని నాకు
వదిలేయండి ప్లీజ్, వదిలేయండి

కవిత చాలా బాగుందండి.
ReplyDelete