Tuesday, 7 February 2012

నరకాన్ని కబీ దేఖా హై త్రీడీపే


మెట్రో ట్రైను వచ్చిన తర్వాత వచ్చే సౌఖ్యమేమో గానీ..  రాకముందు ఓ పదేళ్లు  హైదరాబాదు వాసులకు నరకం త్రీడీలో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. కేపీహెచ్బీ సర్కిల్లో ఇప్పటికే  మెట్రో నరకం షురూ అయింది. విపరీతమైన దుమ్ము, ధూళి. ట్రాఫిక్ జామ్  సంగతి చెప్పక్కర్లేదు.. రోజూ ఆ సర్కిల్ మీదుగా పోయేవారికి అనుభవమే. మెట్రో పనులింకా ఆరంభం  కాకముందే పరిస్థితి ఇలా ఉంటే  ఆరంభమైన తర్వాత...  తలచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. అధికారులకు మాత్రం అలాంటిదేమీ లేనట్లుంది.  ఏమైనా ప్రణాళికలు వారి దగ్గరున్నాయా లేదా అనేదీ అనుమానమే.  రహదారులను వెడల్పు చేస్తారట. మంచిదే కాని అన్ని చోట్లా వెడల్పు చేయడానికి స్థలమెక్కడిది. స్థలం లేని దగ్గర ఏం చేస్తారు.  ట్రాఫిక్కును మళ్లిస్తారా. మళ్లిస్తరపో.. ఏ రోడ్డు ఖాళీగా ఉంది. ఏమైతనేం   ఈ మెట్రో పుణ్యమా అని మరో పదేళ్లైతే భాగ్యనగర వాసులకు బతికుండగానే నరక లోక యాత్ర చేసే అద్భుత అవకాశమైతే దక్కనుంది.

1 comment:

  1. బెంగుళూరు జనాల్ని మొన్నటిదాకా సావనూకినారు నాయనా. ఆసుకమేదో మీరుగూడా అనుబవిస్తేగానీ మాకళ్ళు సల్లబడవు. అనుబవించండి.

    ReplyDelete