ఆవేశాన్ని అదుపు చేసుకోకపోతే పొలిటీషయన్ కాలేడోయ్ అన్నాడు గిరీశం. అన్నాడో లేదో గానీ అనే ఉంటాడు. అనకపోయినా ఏముందిలేండి మనం అనేసుకుందాం.. ఆయన వ్యూస్ గ్యీసూ తెలిసినవే గా. ఇప్పుడు ఆవేశం గురించి... రాజకీయ నాయకుల గురించి ఎందుకంటే కర్ణాటక విధానసభలో ఇద్దరు మంత్రులు ఆవేశం ఆపుకోలేక, అశ్లీల ద్రుశ్యాలు మొబైల్లో చూస్తూ.. మురిసిపోతూ.. ముచ్చెమటలు కక్కుతూ... దొరికిపోయారు. ఒకడు చూస్తున్నాడు. ఇంకోడేమో.. ఏం చూస్తున్నాడన్న ఆసక్తితో చూశాడు. బుగ్గియిపోయాడు. తెలిసి చూసినా తప్పే. తెలియక చూసినా తప్పే కాబట్టి శిక్ష్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఇంతకీ ప్రశ్న ఏంటంటే అసెంబ్లీలో బూతు బొమ్మలు చూడడం తప్పా. చూడకూడదనే నిబంధన ఏమైనా ఉందా? సమాధానం... లేదు. అయినా ఎందుకీ రాద్దాంతమంటే నైతికంగా తప్పు. కానీ ఏది నైతికం. అసెంబ్లీలో బూతు తప్పా. బయట ఎక్కడ కనిపించినా తప్పేనా.
బయట కూడా తప్పేనంటే.. చర్యలేవీ?
ఇప్పడు ఎక్కడ పడితే అక్కడ పోర్న్ విచ్చలవిడిగా సామాన్యజనానికి అందుబాటులోకి వచ్చేసింది. పదేళ్ల పిల్లాడైనా చాలా సునాయాసంగా అరచేతిలోనే బూతు సామ్రాజ్యాన్ని యాక్సెస్ చేస్తున్నాడు. పర్యవసానంగా ఎన్నో నేరాలు, ఘోరాలు. ఇది ఏలుతున్నవారికీ ఎరుకే. కానీ ఎరగనట్లు నటిస్తున్నారు.
ఇప్పుడిద్దరు మంత్రులపై చర్యలు తీసుకోవడం వల్ల నైతికంగా మనమింకా చెడిపోలేదన్న (బలహీనమైన) సంకేతాలు ఇవ్వొచ్చేమో గానీ... వాస్తవం మారిపోదు. మనం పోర్న్ సమాజంలో బతుకుతున్నాం. పూర్తిస్థాయిలోమునిగి తేలతా ఉన్నాం. మరి మునగకుండా ఉండాలంటే. ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం ప్రకటించాలి. రాజు తలచుకుంటే రాస్తాలుండకపోవు. కానీ రాజు తలుచుకుంటాడా లేదా అనేదే బేతాళ ప్రశ్న.

cent per cent correct
ReplyDelete