Sunday, 5 February 2012

ప్రతి ఒక్కడూ దేవుడే

పర్ సపోస్...
నచ్చిన ప్రతి ఒక్కడూ మనకు దేవుడే. అర్హతేంటంటే మనకు నచ్చాలంతే. క్రికెట్... రాజకీయాలు.. ఇలా రంగానికో దేవుడిని ప్రతిష్టించుకుంటాం. పూజించుకుంటాం. మనలాగే వాళ్లూ భూమ్మీద పుట్టారని.. రెండు కాళ్లు, రెండు చేతులతో సంచరిస్తున్నారని మరిచిపోతాం. మానవులుగా నమ్మడానికే ఒప్పుకోం. వారేం చేసినా మహిమలే. వారేం చేయకపోయినా కూడా. ఈ దేవుడి లోకంలో మునిగి చాలా వాస్తవాలను మరిచిపోతుంటాం. నిజాలను నిగ్గుతేల్చే గుణాన్ని.. సూక్ష్మబుద్ధితో ఆలోచించే తత్వాన్ని కోల్పోతుంటాం. కూపస్థ మండూకాల్లా మిగిలిపోతాం. ఏమంటారు?

No comments:

Post a Comment