Saturday, 8 September 2012

తెలంగాణవాది, సమైక్యవాది రాసుకుంటే


ఒక తెలంగాణ వాది.. ఒక సమైక్యవాది భుజం భుజం రాసుకుంటే ఏం వస్తుంది.

దేవేందర్ గౌడ్, యనమల రామక్రిష్టుడు కలిసి తెలంగాణ లేఖ రాస్తే ఏమవుతుంది.

రాష్ట్రం ముక్కలవుతుందో , కలిసి ఉంటుందో చెప్పలేం గానీ.. 

తెలుగుదేశం స్పష్టత జాబితాకు  మాత్రం సంపూర్ణత్వం వస్తుందని చెప్పొచ్చు.


అసలు తెలుగుదేశం పార్టీ ద్రుష్టిలో స్పష్టత అంటే ఏంటి.


రెండు రూపాయలకు కిలో బియ్యం..   ఇది పాత హామీనే.

దీన్నే మళ్లీ చెబితే...  స్పష్టత ఇచ్చినట్లన్న మాట.


వర్గీకరణకు  తెలుగుదేశం అధికారంలో ఉండగానే మద్దతిచ్చింది.

మళ్లీ ఒక్కసారి గట్టిగా చెబితే   స్పష్టత

ప్రణబ్ కు తెలంగాణ విషయంలో ఇంతకుముందే  లేఖిచ్చారు.. పాత విషయమే

మళ్లీలేఖ రాస్తే  స్పష్టతిచ్చినట్లు


అన్ని పాతవిషయాలే.. ఏంటి స్పష్టత అని అడక్కండి

అదే రాజకీయం

ఇక్కడ అస్పష్టతలో కూడా స్పష్టత స్రుష్టించబడును.








No comments:

Post a Comment