ఆంధ్రజ్యోతి కథనమిది
సగం మంది మంత్రులు ఢిల్లీకి
నేడు 'వైఎస్ డైరీ'లపై కేవీపీ పుస్తకావిష్కరణ
హస్తినకు బయల్దేరిన బొత్స
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ముల్లు గుచ్చుకుంది. ఇది... రాజకీయాల
ముల్లు కాదండోయ్! నిజంగా ముల్లే. కర్నూలు జిల్లాలో ఇందిరమ్మ బాటలో ఉన్న
ఆయన గురువారం మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీఎంతోపాటు ప్రముఖులు
నడిచేందుకు ఆలయ అధికారులు కార్పెట్లు పరిచారు. అయితే... వాటిని శుభ్రం
చేయడం మరిచారు. కార్పెట్‌పై ఉన్న ఓ ముల్లు సీఎం అరికాలుకు గుచ్చుకుంది.
దీంతో ఆయన మంత్రి ఏరాసు భుజాన్ని ఆసరాగా చేసుకుని గుచ్చుకున్న ముల్లును
తీసేసుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 : వీహెచ్ వాదన... అరణ్య రోదనే! పుస్తకావిష్కరణ పేరిట వైఎస్ వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలన్న ఆయన మొర 'ఒక్కండును... ఒక్కండును' ఆలకించలేదు. జగన్ పార్టీ తరఫున కేవీపీ కోవర్టుగా పని చేస్తున్నారని వాపోయినా అధిష్ఠానం పట్టించుకోలేదు. నేతలు... పోలోమంటూ ఢిల్లీకి పరుగులు తీస్తున్నారు. వైఎస్ తన పాదయాత్ర సందర్భంగా రాసుకున్న డైరీలకు ఆయన ఆత్మబంధువు కేవీపీ పుస్తక రూపం ఇచ్చి... శుక్రవారం దానిని ఢిల్లీలో ఆవిష్కరిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ఒకరూ ఇద్దరూ కాదు... రాష్ట్ర మంత్రివర్గంలో దాదాపు సగం మంది హాజరవుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గు లాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీతోపాటు మరికొందరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కూడా హాజరు కానున్నారు. కేవీపీ గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి ఈ పుస్తక ఆవిష్కరణ సభకు ఆహ్వానించారు. ఈ ఆహ్వాన పత్రికను ప్రధాని ఆసక్తిగా చదివారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులందరినీ కేవీపీ ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స గురువారం రాత్రే ఢిల్లీకి బయలుదేరారు.
శుక్రవారం మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వట్టి వసంతకుమార్, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, విశ్వరూప్, పొన్నాల, దానం, అహ్మదుల్లా, మాణిక్యవరప్రసాద్ ఢిల్లీ వెళ్లనున్నారు. సాక్షర భారత్ అవార్డును అందుకునేందుకు లక్నో వెళ్తున్న మంత్రి శైలజానాథ్ కూడా కేవీపీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మ రోవైపు... మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కిరణ్ ఇందిర మ్మ బాట షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది. ఇందుకో సం మంత్రి డీకే అరుణ శుక్రవారం సీఎం కిరణ్‌తో సమావేశం కానున్నారు. అది త్వరగా పూర్తయితే... ఆమెతో పాటు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశముంది. మంత్రి పార్థసారథి, సారయ్య ఢిల్లీకి వెళ్లడం లేదు. మరో మంత్రి డీఎల్ ఢిల్లీ వెళ్తున్నా అధిష్ఠానం పెద్దలను కలిసేందుకే ప్రాధాన్యమిస్తున్నారు.

No comments:
Post a Comment