ఎఫ్డీఐలొస్తే కోట్ల ఉద్యొగాలొస్తాయి. ఒప్పుకుంటాం.
యువతకు ఉపాధి పెరుగుతుంది నమ్ముతాం.
రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది విశ్వసిస్తాం
కానీ తర్వాత ఏమవుతుంది
తెరవెనుక ఏమవుతుంది.
తీపికబుర్ల వెనుక చేదు సంగతేంటి.
ఉపాధి మాటున జరిగే దోపిడి సంగతేంటి.
భవిష్యత్తు తరానికి జరిగే నష్టం మాటేంటి.
నాడు కూడా అంతే. వర్తకానికి వచ్చారు బ్రిటిషర్లు
తర్వాత ఏమైంది. శతాబ్దాల బానిసత్వం
నేడది జరగదని గ్యారంటీ ఇవ్వగలరా.
ఇచ్చినా ఆ గ్యారంటీ గడువెంతవరకు
నా వరకా.. నా కొడుకు తరం వరకా
ఆ తర్వాతి తరం పరిస్థితి
వారికీ దేశ వనరులపై హక్కుంటుందా
అసలప్పటివరకు రైతుంటాడా.
వాడికి పొలముంటుందా
ఈ భూమి,
ఈ నేల,
ఈ గాలి..
అసలీ స్వేచ్ఛ ఉంటుందా
No comments:
Post a Comment