Wednesday, 5 September 2012

అన్నా.. సచినన్నా.. ఇదేందన్నా

23 ఏళ్ల నుంచీ ఆడుతున్నాడు.

పరుగులుచేస్తున్నాడు.

దేశాన్ని గెలిపిస్తున్నాడు.

ఇప్పడు వయసు 40

కాస్త ఆట గాడి తప్పింది.

మూడు మ్యాచ్ లలో  క్లీన్ బౌల్డయ్యాడు.

ఎవరూ కారా.

కానీ ఎవరూ ఎప్పడూ కానట్లు.
 భూమి బద్దలైనట్లు
కొంపలు మునిగిపోయినట్లు
భారత క్రికెట్కు అంతిమ ఘడియలు
సమీపించినట్లు
కొందరు రంకెలేస్తున్నారు

రిటైర్ కావాలని

ఇంకెనాళ్లని

కుర్రాళ్లకి ఛాన్సివ్వవా అని

కూతలు చాలానే.

కూస్తున్నారు ఘనంగా

మర్చిపోయారు నాడు కురిసిన హిమ సమూహాలు

మర్చిపోయారు నాడు మెరిసిన శతకాలను

మర్చిపోయారు నాడు హోరెత్తిన స్టేడియాలను

మర్చిపోయారు నాడు చేసిన జపాలను.


ఏంతైనా భారతీయులు క్రుతఘ్గ్నలే.

చేసిన మేలు తొందరగా మర్చిపోతారు.
విశ్వాస ఘాతకులు


అయినా అన్నా...ఇవన్నీ తాటాకు చప్పళ్లే.
అదరకు బెదరకు
బీసీసీఐ నిన్నేమీ అనలేదు.
సెలక్టర్లు గురించి తెలిసిందే.


ఆడు... ఆస్వాదించినన్నాళ్లూ ఆడు.
ఆట ఆగేవరకు ఆడు.
నీ బ్యాటు... నీ ఇష్టం.




కందకు లేని దురద

సారీ సెలెక్టర్లకు లేని దురద

విశ్లేషకలుకు ఎందుకు

అప్పడెప్పడో మంజ్రేకర్  తోక జాడించాడు.

ఏమైంది

తోక ముడుచుకున్నాడు.
లెంపలేసుకున్నాడు.

ఇదిగో కావాలంటే చదవండి



1 comment:

  1. ఐటమ్ బాగా రాశారండి.గుడ్ కీపిటప్. కానీ ఒక్క విషయం చెప్పు.. లక్ష్మణ్ అనగానే కోల్ కత ఇన్నింగ్స్ గుర్తుకొస్తాయి. సెహ్వాగ్ అనగానే వీరబాదుడుతోపాటు, ట్రిపుల్ సెంచరీస్ గుర్తుకొస్తాయి. ద్రవిడ్ అనగానే ఎన్నో టెస్ట్ మ్యాచ్ లలో అడ్డుగోడగా నిలిచిన వైనాలు కళ్లకు కడతాయి. ఇక గంగూలీ అనగానే ధైర్యం, తెగువతో గర్జించే సింహం గుర్తుకొస్తుంది. కానీ సచిన్ అనగానే ఠక్కున గుర్తొచ్చే విసయాలేమైనా ఉన్నాయా? సెంచరీల కోసం ఓవర్లకు ఓవర్లు తినే సంఘటనలే కళ్ల ముందు మెదలుతాయి. కీలకమైన మ్యాచుల్లో అందరికంటే ముందుగా పెవిలియన్ చేరుకోవడం గుర్తుకొస్తాయి. నాయకత్వ లక్షణాలు పూజ్యం. ఒంటి చేత్తో ఇన్నింగ్స్ గెలిపించిన ధాఖలాలే లేవు. వంద సెంచరీల్లో భారత్ గెలిచిన మ్యాచులు పదికి మించి లేవు. ఈయన సమకాలీకులైన విదేశీ క్రికెటర్లు లారా,పాంటింగ్ లను చూడండి. వారి యావరేజ్ చూడండి. ముచ్చటేస్తుంది. మన మాస్టర్ బ్లాస్టర్ గారి యావరేజ్ వారితో పోలిస్తే మరీ తక్కువ. ఏడాదికో, రెండేళ్లకో ఒక సెంచరీ చేయడం, ఆపై సెలక్టర్లు, మాజీల మద్ధతుతో గవర్నమెంట్ ఉద్యోగిలా జట్టును పట్టుకుని వేలాడటం ఏమైనా అంటే నాకు క్రికెట్ తప్ప మరేమీ తెలీదు, ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఆడుతూనే ఉంటాను అంటాడు. ఆట అంటే ఎవరికి ప్రేమ లేదు. కపిల్ దేవ్ కు లేదా; గుండప్ప విశ్వనాధ్ కు లేదా, నిన్న మొన్న రిటైర్ అయిన లక్ష్మణ్, ద్రవిడ్ లకు లేదా? ఈయనగారి మూలంగా ఎంతో మంది యువ క్రికెటర్ల జీవితాలు నాశనమయ్యాయి. గంగూలీ, ద్రవిడ్,లక్ష్మణ్ రిటైర్మెంట్ల విషయంలో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించిన బీసీసీఐ సచిన్ విషయంలో దూకుడు చూపించలేకపోవడం వెనక రెండు, మూడు కారణాలను మనం చెప్పుకోవచ్చు. ఒకటి ముంబాయి క్రికెట్ అసోషియేన్ లాబీయింగ్, సునీల్ గవాస్కర్ వంటి మాజీల అపార మద్ధతు, మీడియాలోని ఒక వర్గం పక్షపాత ధోరణి.
    ఉదాహరణకు గవాస్కర్ నే చూడండి... సచిన్ గారు ఏ అమావాస్యకో, పున్నమికో ఒక యాభై పరుగులు చేయడం ఆలస్యం...మర్నాడు పేపర్లలో గవాస్కర్ గారు వీరంగమే ఆడతారు. అబ్బా ఏం షాట్లు, ఏం ఫుట్ వర్క్, ఏం అది, ఏం ఇది అని పొగడుతూ, ఇలా ఆడటం ఒక్క మాస్టర్ కు తప్ప మరెవ్వరకి సాధ్యం కాదని సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఇవన్నీ యథాతథంగా మీడియాలో వచ్చేస్తుంది. అమాయకులైన క్రీడా ప్రేమికులు ఇదంతా చదివి యావరేజ్ బ్యాట్స్ మన్ అయిన సచిన్ గారిని ఒక గొప్ప క్రికెట్ దేవుడిగా మనసులో ప్రతిష్టించుకుంటాం. నాన్సెన్స్.
    ఇరవై, ముప్ఫై ఏళ్లు అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడితే ఎలాంటి బ్యాట్స్ మన్ అయినా వంద సెంచరీలేం కర్మ, రెండొందల సెంచరీలు కూడా సాధిస్తారు. ఇండియాలో పుట్టడం ఈయన గారి అదృష్టం... అదే ఏ ఆస్ట్రేలియాలోనో పుట్టి ఉంటే మాస్టర్ గారి కెరీర్ ఏ ఐదు, పదేళ్లు మాత్రమే ఉండేది.
    విఖ్బ్రాత క్రికెటర్ బ్రాడ్ మన్ కూడా మన సచిన్ ను మెచ్చుకున్నారు కదాని మీరు అనొచ్చు... మన సచిన్ ను కలిసినపుడు అప్పటికే బ్రాడ్ మన్ గారికి చూపు స్పష్టత లేదు. దృష్టి మాంద్యంతో బాధపడుతున్న వ్యక్తి మన మాస్టర్ బ్లాస్టర్ గారి బ్యాటింగ్ గురించి ఏం చెప్పగలరు. వాళ్లూ, వీళ్లూ, మాజీలు చెప్పింది విని ఏదో మొహమాటానికి నువ్వు కూడా నాలాగే ఆడుతున్నావని సర్టిఫికేట్ ఇచ్చి ఉండొచ్చు. ఇక ఈ పొగడ్తను పట్టుకుని అందరూ అయ్యగారికి భారత క్రికెట్ జట్టులో ఫెవికాల్ వేసి కూర్చోబెట్టేశారు.
    చివరగా చెప్పేది ఒక్కటే... ఆటను ప్రేమిద్దాం. వ్యక్తుల్ని కాదు. బాగా ఆడినంత కాలం గౌరవిద్దాం. ఆడలేక మద్దెల ఓడన్నప్పడు సగౌరవంగా సాగనంపుదాం.

    ReplyDelete