Friday 21 December 2012

మోడీ విజయం వెనుక..

కొన్ని నిజాలను ఒప్పుకోవటానికి మనసు అంత తొందరగా అంగీకరించదు. 
అందుకే కరిష్మా, కాకరకాయ, అభివ్రుద్ధి లాంటి తీయని పదాలతో
ఆ చేదు నిజాలకు చక్కెర పూస్తుంటాం.
మోడీ  విషయంలోనూ ఇప్పడదే జరుగుతోంది. 
మూడోసారి ఎందుకు గెలిచాడంటే అభివ్రుద్ధి అంటున్నాం.
కానీ వాస్తవం అదేనా.


2002  అల్లర్లతో  మైనారిటీ వర్గాల్లో  భయం ఏర్పడింది. 
ఆ భయం మెజారిటీ వర్గాలకు నచ్చింది.
ఆ మెజారిటీయే తదనంతర ఎన్నికల్లో 
నరేంద్రుడిని ఆదరించింది. పగ్గాలందించింది
ఐతే మోడి తెలివైనోడు.
2002తో తనను మెజారిటీ ఆదరించినా, 
మళ్లీ మళ్లీ నెగ్గడానికి  అది మాత్రమే సరిపోదని తెలుసుకున్నాడు. 
ఎందుకంటే ఆదరించిన మెజారిటీ వర్గాలకూ 
ఆశలుంటాయి. ఆకాంక్షలుంటాయి.
కుటుంబాలుంటాయి. కోరికలుంటాయి. 
కాబట్టి  2002ను చూసి ప్రతిసారీ వారు ఓటేయలేరు.
అందుకే  డెవలెప్మెంట్ కార్డు తీశాడు
ఇక్కడో విషయాన్ని గమనించాలి
గుజరాత్ ముందునుంచీ పారిశ్రామికంగా 
అభివ్రుద్ధి చెందిన రాష్ట్రం.
ఒరిస్సా లాంటి రాష్ట్రాన్ని దేశంలో నెం.1గా తీర్చిదిద్దితే 
దాన్ని గొప్ప ఘనత అనొచ్చేమో గానీ..
అభివ్రుద్ధి పథంలో ఉన్న గుజరాత్ ముందుకు తీసుకెళ్లడం  
అంత గొప్ప ఘనత కింద లెక్కేయలేం.
కానీ మోడి దాన్ని కూడా  గొప్ప ఘనతగానే ప్రచారం చేశాడు.
మరీ విషయం గుజరాత్ ప్రజలకు తెలీదా అంటే  తెలుసు. 
అయితే 2002  కూడా వారి మనసుల్లో బలంగా ఉంది. 
అందుకే రాష్ట్రమంతా ఒకే రకంగా అభివ్రుద్ధిచెందకపోయినా,
అసమానతలున్నా..  నరేంద్రుడిని మారుద్దామనుకోలేదు.
పెద్ద తప్పులు చేయకుండా, అప్పడప్పుడు 2002ను కెలుకుతూ
ముందుకు సాగితే  2016లోనూ  మోడీని గుజరాత్ ప్రజలు మార్చకపోవచ్చు.
మోడీ స్థానంలో ఇంకొకరుంటే ఇదే విషయాన్ని గట్టిగా చెప్పలేమనుకోండి.

 
అందుకే మోడీ వ్యక్తిత్వాన్నీ ఇక్కడ ద్రుష్టిలో పెట్టుకోవాలి
అతను సాదాసీదా రాజకీయ నాయకుడుకాదు. 
ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో నుంచి ఎదిగిన నాయకుడు. 
సంఘ్ పై  ఉండే వాళ్లకు చరిత్ర పట్ల ఒక అవగాహన ఉంది. 
అది మంచిదా చెడుదా అని చెప్పను గానీ,
అదే అవగాహన మోడీకీ ఉంది.
ఆ అవగాహన ఆధారంగా అతను పనితీరుంటుంది.
పైకి  జనతా జనార్ధన్, ఛే కరోర్ గుజరాతీ లాంటి కబుర్లు చెప్పినా,
నరేంద్ర భాయ్ అంతిమ లక్ష్యం సంఘ్ ఏజెండానే.

దాన్ని గుజరాత్లోని మెజార్టీ ప్రజలు సమర్థిస్తున్నారు. 
మరి దేశంలోని మెజార్టీ ప్రజలూ సమర్థిస్తారా లేదా అన్నది
కాలమే నిర్ణయించాలి.




4 comments:

  1. *ఒరిస్సా లాంటి రాష్ట్రాన్ని దేశంలో నెం.1గా తీర్చిదిద్దితే దాన్ని గొప్ప ఘనత అనొచ్చేమో గానీ*

    ఒరిస్సా లో చాలా భాగం మావో ల చేతిలో దశాబ్దాలుగా ఉంది. వాళ్ళు ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు?

    *నరేంద్ర భాయ్ అంతిమ లక్ష్యం సంఘ్ ఏజెండానే*

    అంతిమ లక్ష్యం అంటూ భవిషత్ లో అధికారం లోకి వచ్చి ఎదో చెస్తారను కొంట్టున్నారు. మీ అభిప్రాయం తప్పు "నమో" మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం ఆ రెండిటి మధ్యలో ఉనది కూడా సంఘ్ ఏజెండానే! మీరేమి వర్రి కాకండి .

    *మెజార్టీ ప్రజలూ సమర్థిస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి*

    కాలం నిర్ణయించేది ఎమీ లేదు ప్రధానిగా భారత ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు.

    ReplyDelete
  2. Sir,

    Afghanistan once used to have computers and modern technology what happened now?

    Bihar before Lalu and after Lalu whats the difference.

    How corruption in Andhra before YSR and after YSR? before YSR its ~50% now its 80-90%

    Sometimes NOT destroying the system is also great thing.

    ReplyDelete
  3. You don't like Modi, but you don't agree it openly.

    "2002 అల్లర్లతో మైనారిటీ వర్గాల్లో భయం ఏర్పడింది.
    ఆ భయం మెజారిటీ వర్గాలకు నచ్చింది.
    ఆ మెజారిటీయే తదనంతర ఎన్నికల్లో
    నరేంద్రుడిని ఆదరించింది. పగ్గాలందించింది"

    "1947 అల్లర్లతో మెజారిటీ వర్గాల్లో భయం ఏర్పడింది.
    ఆ భయం మైనారిటీ వర్గాలకు నచ్చింది.
    ఆ మైనారిటీయే తదనంతర ఎన్నికల్లో
    కాంగ్రేస్ ని ఆదరించింది. పగ్గాలందించింది"

    "ఎందుకంటే ఆదరించిన మెజారిటీ వర్గాలకూ
    ఆశలుంటాయి. ఆకాంక్షలుంటాయి.
    కుటుంబాలుంటాయి. కోరికలుంటాయి. "

    ఎందుకంటే ఆదరించిన మెజారిటీ వర్గాలకూ
    ఆశలుంటాయి. ఆకాంక్షలుంటాయి.
    కుటుంబాలుంటాయి. కోరికలుంటాయి. దాన్ని కాంగ్రేస్ తన ఓటు బ్యాంకు గా మార్చుకుంది.

    .............

    ..............

    ReplyDelete
  4. ఓ వెనుకబడిన రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలబెడితే అది గొప్ప ఘనత అవుతుందని చెప్పటానికి మాత్రమే ఒరిస్సాను ఉదహరించాను. ఒరిస్సా మావోల చేతుల్లో ఉందా, లేదా అనేది ఇక్కడ చర్చకాదు. 47 అల్లర్లను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చుకుందా లేదా అనేది కూడా వేరే చర్చే. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నరేంద్ర మోడీ 2002ను ఆసరాగా చేసుకొనే 2012లో అధికారంలోకి వచ్చాడన్నది మాత్రమే

    ReplyDelete