Tuesday 25 December 2012

అమ్మతో అన్న మాటే అన్నానే, బూతెలా అయిందబ్బా

ఠీక్ హై.. ఎంత సుందరమైన పదం
అదేదో సినిమాలో అంటాడు నానా పటేకర్.
ఏక్ మఛ్ఛర్  ఆద్మీ కో హిజడా బనాదేతాహై అని
అలా ఒక్క ఠీక్ హై..
ఎంత కష్టం తెచ్చింది మన ప్రధానికి



మన్మోహన్జీ, చిల్లర బిల్లు లాయియే
ఠీక్ హై మేడం
ప్రధానీజీ, అణు బిల్లు చాహియే
ఠీక్ హై మేడం
సింగ్జీ  ఘర్ కో  ఏక్బార్ ఆయియే
ఠీక్ హై మేడం


ఆ ఫ్లోలోనే ..    మూఢభక్తిలోనే
ఇక్కడా ఠీక్ హై అన్నాడు
అదే  తప్పైపోయింది జనానికి
ఎంత మాట ఎంత మాటంటున్నారు.
ఇన్నాళ్లూ అదే పదాన్ని ఎన్నిసార్లన్నా 
ఏమీ అనని జనం ఇప్పడు కళ్లెర్రచేస్తున్నారు.


అలవాట్లో పొరపాటని,
ఆటలో అరటిపండని,
కూరలో కరేపాకని ,
వదిలేడంలేదు.
అందలాన్ని అందించిన పదంపై
అమ్మకు సంతోషాన్నిచ్చిన పదంపై
నిప్పులు చెరగుతున్నారు

ఏం చేస్తాం, ఠీక్ హై .




No comments:

Post a Comment