Monday 24 December 2012

ఓ క్లాస్ పీకాను, నచ్చితే పాస్ ఇట్ ఆన్

ఉన్నమాటంటే అందరికీ ఉలుకేనండీ
ఇప్పడు సత్తిబాబు ఏమన్నాడనీ
అంతగా  గగ్గోలు పెట్టేత్తున్నారు.
అర్ధరాత్రి సొతంత్రం వచ్చిందని 
ఒంటరిగా తిరుగుతామా అని అన్నాడు.
అంతే కదా, దీనికే  పొలోమని మీద పడిపోవాలా
తెలాకా ఆడుగుతాను ఆయనన్న దాంట్లో తప్పేముందండే
భద్రం బీకేర్ ఫుల్ అని ఓ జాగ్రత్త చెప్పాడు.
ఎందుకు చెప్పాడు, మద్యం దుకాణాల యజమానిగా 
తనకు అనుభవముంది కాబట్టి చెప్పాడు.

సత్తెబాబు మందు దుకాణంలో
ఫుల్ బాటిల్ కొట్టిన ఏ వెధవైనా 
అర్ధరాత్రి  అమ్మాయి కనబడితే ఊరుకుంటాడండీ.
కోడు. కాబట్టి  కేర్ఫుల్లూ  అని అన్నాడు.  అర్ధం చేసుకోరూ


అయినా  బొత్సలాంటి రాజకీయనాయకులు 
రాజకీయం నడుపుతున్నంతసేపూ ,
నాయకులుగా ఎన్నికవుతున్నంతసేపూ
ఇలాంటి వ్యాఖ్యలూ వస్తూనే ఉంటాయి
వివక్షలు సాగుతూనే ఉంటాయి.
ఎందుకంటే ఆళ్లు బతికేదే ఈ పునాదులపై
అవే లేకపోతే వాళ్ల రాజకీయ పునాదులే ఉండవు.
అందుకే  సత్తెకాలపు ఆలోచనలతోనే
ఈ సమాజం ఎప్పటికీ ఉండాలనీ, 
మార్పు రాకూడదని,  వచ్చినా 
దాన్ని వీలైనంత సమయం వాయిదా వేయించాలని
ప్రయత్నిస్తూ ఉంటారు. 
ఆ ప్రయత్నంలో ఇలాంటి వాగుడు
వాగతా ఉంటారు
సో వ్యవస్థ మారాలంటే ముందు సత్తెబాబులు పోవాలి. 
అది జరిగితే అటోమేటిగ్గా చానా జరిగిపోతాయి. ఏమంటారు.




 

No comments:

Post a Comment