Wednesday 12 September 2012

చేతిలో కలముందని, ఎదురుగా ఇంటర్నెట్ ఉందని

రాయకండి రాతలు
చేయకండి విమర్శలు

ధిక్కారస్వరాలు వినిపించాలని,
దిక్కులు పిక్కటిల్లేలా  అరవాలని
అభిప్రాయాలను వెల్లడించాలని
సమాజాన్నిచైతన్యవంతం  చేయాలని
లోగుట్టులు విప్పాలని,
పైపై మెరుగుల బండారాన్ని బయటపెట్టాలని
ప్రయత్నించకండి.
మౌనంగా ఉండండి.
చాతకాకపోతే
కాస్త  మత్తు మందు తాగండి.
వేయి ఆలోచనలను
వేల దురాగతాల్ని
మీ గొంతులోనే సమాధి చేయండి.


చేతిలో కలముందని.
ఎదురుగా ఇంటర్నెట్ ఉందని,
రాజ్యాంగం స్వేఛ్చ ఇచ్చిందని,
రాత నా జన్మహక్కని
ప్రపంచంలోని అతిగొప్ప
ప్రజాస్వామ్యంలో పౌరుడినని
నాకు ఎదురేలేదని
విర్రవీగావో..

అదిగో అసీమ్ త్రివేది.
బందిఖానాలో... సంకెళ్లతో










2 comments:

  1. chaala baaga raasaaru...vennela raajyam gaaru. very nice

    ReplyDelete
  2. అతి సున్నిత అంశం..
    తప్పే.. కానీ .. మీరు కూడా చేతిలో.. కలముందని.. క్షమించాలి..

    ReplyDelete