Wednesday 5 September 2012

అలా చేయండి బాబు గోరు.. యార్లగడ్డ ప్రెస్మీట్లు పెట్టడు

కూరలో కరివేపాకంటూ కరివేపాకుని చాలా తేలిగ్గా తీసేస్తారు.

రాజకీయాల్లో మూడో ఫ్రంట్ పరిస్థితీ కరివేపాకులాంటిదే.

మూదో ఫ్రంట్  పేరు వింటేనే ప్రజలకు మూడ్ రావడం మానేసి చాలా కాలమైంది.

అదే లాలూ, అదే బాబు.. అదే బర్ధన్, అదే దేవెగౌడ

పాతకాపులే. పాతసారానే. కానీ కొత్తగా కనిపించాలి.

ఏం చేయాలి. పేరు మారిస్తే పోలా.

అందుకే మూడో ఫ్రంట్ పేరు మార్చాలనే ఆలోచనలో ఉన్నారు నాయకులు


పేరేదైనా ఫర్వాలేదు. పేరులో మాత్రం మూడు  ఉండకూడదు.

ఇందుకోసం అటు ఇటు కాని చాలా పేర్లను ఇప్పటికే చర్చించారు.

పేరు విషయంలో బాబు మాత్రం ఓ షరతు పెట్టారట

మూడు తీసేసినా.. పేరులో ఫ్రంట్ మాత్రం ఉండాలట

అలా ముందుకు పోదాం అని ఎప్పడూ అనే  బాబూ ఏ పన్లోనైనా  ఫ్రంట్నే ఉండాలని తాపత్రయపడతారు.

ఈ మధ్య ఎన్నికల్లో కూడా అలానే ఫ్రంట్నే  ఉంటున్నారు.

వస్తున్నది వెనక నుంచి కదా. అంటారేమో.

వెనకనుంచైనా ఫ్రంటే కదా

 మొత్తానికి ఫ్రంట్కు ఓ కొత్త  పేరు కావాలి.

అన్నగారెప్పుడో భారతదేశం అన్న పార్టీని జాతీయస్థాయిలో పెట్టాలనుకున్నారు.

ఆ పేరు మూడో ఫ్రంట్కు పెడితే..

భారత ఫ్రంట్. మావగారి ఆత్మ శాంతిస్తుంది.అత్త గారు ఆగ్రహం పోతుంది.

హరిక్రిష్ణ ఆసుపత్రి నుంచి కులాసాగా ఇంటికి వెళ్లిపోతాడు.

పురందేశ్వరి కూడా యార్లగడ్డతో ప్రెస్ మీట్లు పెట్టించదు.

అంతా అన్నగారి కుటుంబం అని పాట పాడుకోవచ్చు.

ఏమంటారు బాబుగారు..


No comments:

Post a Comment