Thursday 20 September 2012

ఏంటి మద్దతిస్తారా లేదా

తప్పు కేజ్రీవాలాదా లేదా అన్నాదా అని ఎంచడం ఆపాలి
ఇద్దరూ వేర్వేరు దారులను ఎంచుకున్నారు
ఆ దారుల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారు.
అన్నా.. దీక్షల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలనుకుంటున్నారు.
కేజ్రీ.. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ప్రవేశించి
మన జేపీలా కుళ్లును కడిగేయాలనుకుంటున్నారు.
జేపీ కూడా ముందు లోక్సత్తా ఉద్యమం ప్రారంభించి
 ప్రజలను చైతన్యవంతులను చేశాడు.
ఆ తర్వాత పార్టీ పెట్టాడు. ప్రజలను ఓట్లడిగాడు..
అంతగా విజయవంతం కాలేకపోయాడు.
మరి కేజ్రీవాలా కూడా మరో జేపీలానే మిగిలిపోతాడా.
లేక జేపీ కంటే ఎక్కువడగులు వేస్తాడా
నిజానికి సంప్రదాయ పార్టీల పోటీ తట్టుకొని
 జేపీ, కేజ్రీల్లాంటివాళ్లు నిలబడడం కష్టం
కానీ ఎక్కడో ఒక దగ్గర ఓ అడుగుపడాలి. 
ఆ అడుగు ధైర్యంగా మొన్న జేపీ వేసాడు. ఇప్పడు కేజ్రీ వేస్తున్నాడు.
వీరిద్దరికి మనం మద్దతివ్వాల్సిన తరుణం ఆసన్నమైంది.

No comments:

Post a Comment