Thursday 6 September 2012

చాణక్య చంద్రబాబు

ఫ్రంట్ పేజీలో  ఆంధ్రజ్యోతి కథనమిది


చంద్రబాబు యోధుడు
దళితుల్లో ఒక వర్గాన్ని ఆకర్షించారు
బీసీలనూ తనవైపు తిప్పుకున్నారు

ఈ వ్యూహాలు కాంగ్రెస్‌కు చేతకావు
ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది
సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీల వ్యాఖ్యలు
చంద్రబాబుతో ముగ్గురి భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కాంగ్రెస్ ఎంపీలు ఏమనుకుంటున్నారు!? వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు!? జగన్‌కు చెక్ చెప్పాలంటే ఏం జరగాలని భావిస్తున్నారు!? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే, ఓసారి పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు వెళ్లాల్సిందే!


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6 : గురువారం మధ్యాహ్నం సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. వాస్తవానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు అడుగంటి పోయాయని ఆ పార్టీ ఎంపీలే భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బలరాం నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం టీడీపీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఆ తర్వాత సెంట్రల్ హాల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. చంద్రబాబు తనకు రాజకీయంగా జన్మనిచ్చారని, నిజానికి కాంగ్రెస్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు అవుతుందని ఒక ఎంపీ వ్యాఖ్యానించగా.. అలా జరిగితే రెండు పార్టీలూ ఓడిపోతాయని, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఎ వరూ అడ్డుకోలేరని మరో ఎంపీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్సేనని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీల మధ్య కొంతసేపు చర్చ జరిగింది. "చంద్రబాబు ఫైటర్. ఒక యోధుడు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా అలుపెరగకుండా పోరాడుతున్నారు'' అని మరో ఎంపీ కితాబిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ రావడం కన్నా టీడీపీ అధికారంలోకి రావడమే మంచిదని, ఆ తర్వాత జగన్ పార్టీ మటుమాయమైపోతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎవరి పక్షం వహించాలా అన్న అం శంపైనా ఎంపీల మధ్య చర్చ సాగింది. బాబు మంచి వ్యూ హకర్త అని, దళితుల్లో అధికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళుతున్నారని గ్రహించి, వర్గీకరణకు మద్దతు పలికి, వారి లో ఒక వర్గాన్ని తన వైపునకు తిప్పుకొన్నారని, ఇప్పుడు బీసీలపై దృష్టి కేంద్రీకరించారని, కాంగ్రెస్‌కు ఇలాంటి వ్యూహాలు చేతకావని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. జగన్ మాదిరిగా బాబు మహా అవినీతిపరుడు కాదని, ఆయనకు రాష్ట్రం పట్ల స్పష్టమైన అవగాహన ఉందని, ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు.

No comments:

Post a Comment