Tuesday 4 September 2012

మళ్లీ చంద్రబాబు లాంటి బకరా కోసం...

దేశం ఐక్యత గురించి ఆలోచిస్తాం.

జాతీయ థ్రుక్పథం  మా వైఖరి

కుహానా లౌకికవాదానికి మేం దూరం

ఇలా చాలా డప్పాలు కొడుతూ ఉంటుంది బీజేపీ

అలాంటి బీజేపీ తెలంగాణపై అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే
 ఓట్ల కోసం ఆ పార్టీ  ఏ స్థాయికి దిగజారిపోతుందో అర్థమవుతోంది.

అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ ఇస్తుందట.

ఢిల్లీలో ఈ రోజు సుష్మా చెబుతోంది.

మూడు నెలల్లో ఓ రాష్ర్టాన్ని ముక్కలు చేయడం ఎంత సులువైపోయిందో చూడండి.

సుష్మా స్వరాజ్ జాతీయనేత. ఆమెపట్ల చాలా గౌరవముంది ప్రజల్లో

అలాంటి నేత కాస్త దూరద్రుష్టితో వ్యవహరిస్తుందని,, వాస్తవాలు తెలుసుకొని...

కాస్త లోతైన అవగాహనతో మాట్లాడుతుందని ఆశిస్తాం.

కానీ మూడు నెలల్లో ముక్కల్లాంటి

మాటలు ఆమె స్థాయిని దిగజార్చేవే.

ఒక్క బీజేపీయే కాదు.. తెలంగాణపై అన్ని పార్టీలు నాటకాలు ఆడుతున్నాయనుకోండి.

కానీ బీజేపీ నాటకం కాస్త భిన్నం

ఎలాగూ అధికారంలోకి రాదు.

వచ్చినా ఇతర పార్టీల మద్దతుతోనే

మద్దతిచ్చిన పార్టీల్లో కొన్ని ఎలానూ వ్యతిరేకిస్తాయి.

కాబట్టి  చంద్రబాబు అడ్డు తగిలాడని చెప్పుకుని
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టినట్లు..
మళ్లీ అధికారంలోకి రాగానే మరో బాబో రావో పేరు వెతుక్కుంటుంది

మా చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేస్తుంది

 జరిగేది ఇదే. కానీ జరగని విషయాన్ని ప్రజలకు చెబుతోంది.

ఆశలు కల్పిస్తోంది. ఆ ఆశలను పునాదిగా చేసుకొని రాజకీయంగా తెలంగాణలో

పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది.







4 comments:

  1. కనీసం మీరు సమర్ధమైన జాతీయ party ఏదో చెప్పండి.

    ReplyDelete
  2. 30 yendlu teesukunte vidipovachha. idemanna kothha udyamama... vidagottadaaniki 3 nimishaalu aina chaalu.. already memu eppudo vidipoyamu.

    nee baadha entante nee asthulalo vaatalu kosamu.. asthule lenivallaki.. vatala.. LOL

    ReplyDelete
  3. నా అభిప్రాయమైతే ఎస్సార్సీ వేయాలి. శాస్రీయమైన మదింపు జరగాలి. అటుపిమ్మట ఒకటి కాదు పది రాష్ట్రాలుగా విడగొట్టినా అభ్యంతరంలేదు. ఏదో ఒక ప్రమాణమైతే పాటించాలి.

    ReplyDelete
    Replies
    1. Well said. But, rationality won't work with sentimental fools! ;)
      "The sentiment is strong" - Tg Con-grass buffoons. :D

      Delete