Wednesday, 26 December 2012

అమ్మా... ప్రతిభమ్మా మమ్మల్ని మాఫ్ చేయ్


ఎన్నన్నాం నిన్ను 
ఎంతలా ఆడిపోసుకున్నాం
ఇంతకుముందు ఎవరూ చేయనట్టు
ఇక ముందు ఎవరూ చేయరన్నట్లు 
తప్పైపోయింది తల్లీ .. ఇవిగో లెంపలు


President Pranab Mukherjee used just for an hour



Rs 37 lakh spent on room President Pranab Mukherjee used just for an hour
The government renovated the Circuit House ahead of President Pranab Mukherjee's visit.
BELGAUM: Rs 198 lakh of the taxpayers' money was spent when President Pranab Mukherjee was in Belgaum to inaugurate the Suvarna Vidhana Soudha in October.

The government renovated the circuit house (CH) ahead of President Pranab Mukherjee's visit. It spent over Rs 161 lakh on renovation and around Rs 37 lakh on furnishing the room, where Mukherjee spent just an hour on October 11.

RTI activist Bhimappa Gadad from Mudalagi in Gokak taluk sought information from the public works department on the expenditure incurred during the President's visit.

There are two Circuit House buildings in the same compound near the central bus stand. One was inaugurated two years ago. The old building and the compound was renovated during the World Kannada Meet (WKM) held in the city last year.

This before the government spent Rs 32 lakh in 2010-11 and Rs 18 lakh in 2011-12 for renovating the circuit house.

Tuesday, 25 December 2012

అమ్మతో అన్న మాటే అన్నానే, బూతెలా అయిందబ్బా

ఠీక్ హై.. ఎంత సుందరమైన పదం
అదేదో సినిమాలో అంటాడు నానా పటేకర్.
ఏక్ మఛ్ఛర్  ఆద్మీ కో హిజడా బనాదేతాహై అని
అలా ఒక్క ఠీక్ హై..
ఎంత కష్టం తెచ్చింది మన ప్రధానికి



మన్మోహన్జీ, చిల్లర బిల్లు లాయియే
ఠీక్ హై మేడం
ప్రధానీజీ, అణు బిల్లు చాహియే
ఠీక్ హై మేడం
సింగ్జీ  ఘర్ కో  ఏక్బార్ ఆయియే
ఠీక్ హై మేడం


ఆ ఫ్లోలోనే ..    మూఢభక్తిలోనే
ఇక్కడా ఠీక్ హై అన్నాడు
అదే  తప్పైపోయింది జనానికి
ఎంత మాట ఎంత మాటంటున్నారు.
ఇన్నాళ్లూ అదే పదాన్ని ఎన్నిసార్లన్నా 
ఏమీ అనని జనం ఇప్పడు కళ్లెర్రచేస్తున్నారు.


అలవాట్లో పొరపాటని,
ఆటలో అరటిపండని,
కూరలో కరేపాకని ,
వదిలేడంలేదు.
అందలాన్ని అందించిన పదంపై
అమ్మకు సంతోషాన్నిచ్చిన పదంపై
నిప్పులు చెరగుతున్నారు

ఏం చేస్తాం, ఠీక్ హై .




ఓడితే ఓడారు గాన్రా



ఆడేవడో భువనేశ్వరట
ఏమేశాడు, ఏమేశాడు
కుమ్మేశాడు
3 ఓవర్లు 9 పరుగులు
ఇన్స్వింగ్  అవుట్స్వింగు
ఇరగదీశాడు
వీడూ యూపీ కుర్రానేనట
అందుకే తాగుబోతు ప్రవీణ్ లానే
స్వింగ్ తో చిందేశాడు
 


 



Monday, 24 December 2012

బావా.. అదిగో మోడీ పురి, అదిగో అధికారం

బావా.. అదిగో మోడి పురి. 
అదిగో  2014లో మన అధికారానికి సాయపడే కాషాయదళం
అదిగో  సదా మన సేవలోనే  తరించే వెంకయ్య నాయుడు
అదిగో మన మేలు కోరే పెద్దాయన అద్వాని
అదిగో మనకు ఓట్లు తెచ్చే లడ్డూ నరేంద్రభాయ్ 
అదిగో 99లో మన వెంట నడిచిన నాయకగణం

వెళ్లమందువా బావా,  మోడీ పురి వెళ్లమందువా
వెళ్లి  నాటి చెలిమిని మళ్లీ ఓ సారి గు్తు చేయమందువా
చేసుకున్న బాసలు చెరిగిపోవనీ,
అధికారంపై శలు మెండుగా ఉన్నవనీ,
2014లోని మనతోనే నడవమనీ
కాషాయం, పసుపు ఒకటేననీ,.
ఎన్నటికీ విడిపోని జంట మనదేననీ
లౌకికవాదం ఓ ముసుగేననీ.
అధికారమే పరమావధి అనీ

నీ మాటగా వారికి చెప్పి,
రమ్మందువా బావా. 
 






షిండే వాకిట్లో తెలంగాణ చెట్టు



తోడు దొంగలు సినిమా చూశారా
ఇద్దరు దొంగలుంటారు.
కలిసే దొంగతనాలు చేస్తా ఉంటారు
దోచుకున్నదీ కలిసే  పంచుకుంటా ఉంటారు.
ఏంటీ చూడలేదా. చూశారుగానీ. 
అలా ఉండదంటారా
్చ్...  సినిమా పేరలా ఉంది కాబట్టి
కథా అలానే ఉంటుందనుకున్నా
అడ్డం తిరిగినట్టుంది.


పోనీ అఖిలపక్షం నాటకం ఎప్పడైనా చూశారా
ఢిల్లీలో ఆడతా ఉంటాది. హోం మంత్రి ఆడిస్తా ఉంటాడు
ఒక్కో పార్టీ తరఫున ఇద్దరు వెళతా  ఉంటారు.
వెళ్లిన ఇద్దరూ  వేర్వేరు మాటలు చెబుతా ఉంటారు. అయినా
పక్కపక్కనే కూర్చోని కుళ్లు జోకులేసుకుంటా ఉంటారు.
నాటకం ఆడించేవాళ్లు  కూడా ఆ జోకులకు 
విరగబడి నవ్వుతూ.. తెర దించేస్తా ఉంటారు.

చూడ్లేదా... 28న మళ్లీ మీ కోసం వేస్తున్నారు. 


నాటకం పేరు; షిండే వాకిట్లో తెలంగాణ చెట్టు
చిరునామా, నార్తు బ్లాకు.  న్యూఢిల్లీ


 




ఓ క్లాస్ పీకాను, నచ్చితే పాస్ ఇట్ ఆన్

ఉన్నమాటంటే అందరికీ ఉలుకేనండీ
ఇప్పడు సత్తిబాబు ఏమన్నాడనీ
అంతగా  గగ్గోలు పెట్టేత్తున్నారు.
అర్ధరాత్రి సొతంత్రం వచ్చిందని 
ఒంటరిగా తిరుగుతామా అని అన్నాడు.
అంతే కదా, దీనికే  పొలోమని మీద పడిపోవాలా
తెలాకా ఆడుగుతాను ఆయనన్న దాంట్లో తప్పేముందండే
భద్రం బీకేర్ ఫుల్ అని ఓ జాగ్రత్త చెప్పాడు.
ఎందుకు చెప్పాడు, మద్యం దుకాణాల యజమానిగా 
తనకు అనుభవముంది కాబట్టి చెప్పాడు.

సత్తెబాబు మందు దుకాణంలో
ఫుల్ బాటిల్ కొట్టిన ఏ వెధవైనా 
అర్ధరాత్రి  అమ్మాయి కనబడితే ఊరుకుంటాడండీ.
కోడు. కాబట్టి  కేర్ఫుల్లూ  అని అన్నాడు.  అర్ధం చేసుకోరూ


అయినా  బొత్సలాంటి రాజకీయనాయకులు 
రాజకీయం నడుపుతున్నంతసేపూ ,
నాయకులుగా ఎన్నికవుతున్నంతసేపూ
ఇలాంటి వ్యాఖ్యలూ వస్తూనే ఉంటాయి
వివక్షలు సాగుతూనే ఉంటాయి.
ఎందుకంటే ఆళ్లు బతికేదే ఈ పునాదులపై
అవే లేకపోతే వాళ్ల రాజకీయ పునాదులే ఉండవు.
అందుకే  సత్తెకాలపు ఆలోచనలతోనే
ఈ సమాజం ఎప్పటికీ ఉండాలనీ, 
మార్పు రాకూడదని,  వచ్చినా 
దాన్ని వీలైనంత సమయం వాయిదా వేయించాలని
ప్రయత్నిస్తూ ఉంటారు. 
ఆ ప్రయత్నంలో ఇలాంటి వాగుడు
వాగతా ఉంటారు
సో వ్యవస్థ మారాలంటే ముందు సత్తెబాబులు పోవాలి. 
అది జరిగితే అటోమేటిగ్గా చానా జరిగిపోతాయి. ఏమంటారు.




 

Friday, 21 December 2012

మోడీ విజయం వెనుక..

కొన్ని నిజాలను ఒప్పుకోవటానికి మనసు అంత తొందరగా అంగీకరించదు. 
అందుకే కరిష్మా, కాకరకాయ, అభివ్రుద్ధి లాంటి తీయని పదాలతో
ఆ చేదు నిజాలకు చక్కెర పూస్తుంటాం.
మోడీ  విషయంలోనూ ఇప్పడదే జరుగుతోంది. 
మూడోసారి ఎందుకు గెలిచాడంటే అభివ్రుద్ధి అంటున్నాం.
కానీ వాస్తవం అదేనా.


2002  అల్లర్లతో  మైనారిటీ వర్గాల్లో  భయం ఏర్పడింది. 
ఆ భయం మెజారిటీ వర్గాలకు నచ్చింది.
ఆ మెజారిటీయే తదనంతర ఎన్నికల్లో 
నరేంద్రుడిని ఆదరించింది. పగ్గాలందించింది
ఐతే మోడి తెలివైనోడు.
2002తో తనను మెజారిటీ ఆదరించినా, 
మళ్లీ మళ్లీ నెగ్గడానికి  అది మాత్రమే సరిపోదని తెలుసుకున్నాడు. 
ఎందుకంటే ఆదరించిన మెజారిటీ వర్గాలకూ 
ఆశలుంటాయి. ఆకాంక్షలుంటాయి.
కుటుంబాలుంటాయి. కోరికలుంటాయి. 
కాబట్టి  2002ను చూసి ప్రతిసారీ వారు ఓటేయలేరు.
అందుకే  డెవలెప్మెంట్ కార్డు తీశాడు
ఇక్కడో విషయాన్ని గమనించాలి
గుజరాత్ ముందునుంచీ పారిశ్రామికంగా 
అభివ్రుద్ధి చెందిన రాష్ట్రం.
ఒరిస్సా లాంటి రాష్ట్రాన్ని దేశంలో నెం.1గా తీర్చిదిద్దితే 
దాన్ని గొప్ప ఘనత అనొచ్చేమో గానీ..
అభివ్రుద్ధి పథంలో ఉన్న గుజరాత్ ముందుకు తీసుకెళ్లడం  
అంత గొప్ప ఘనత కింద లెక్కేయలేం.
కానీ మోడి దాన్ని కూడా  గొప్ప ఘనతగానే ప్రచారం చేశాడు.
మరీ విషయం గుజరాత్ ప్రజలకు తెలీదా అంటే  తెలుసు. 
అయితే 2002  కూడా వారి మనసుల్లో బలంగా ఉంది. 
అందుకే రాష్ట్రమంతా ఒకే రకంగా అభివ్రుద్ధిచెందకపోయినా,
అసమానతలున్నా..  నరేంద్రుడిని మారుద్దామనుకోలేదు.
పెద్ద తప్పులు చేయకుండా, అప్పడప్పుడు 2002ను కెలుకుతూ
ముందుకు సాగితే  2016లోనూ  మోడీని గుజరాత్ ప్రజలు మార్చకపోవచ్చు.
మోడీ స్థానంలో ఇంకొకరుంటే ఇదే విషయాన్ని గట్టిగా చెప్పలేమనుకోండి.

 
అందుకే మోడీ వ్యక్తిత్వాన్నీ ఇక్కడ ద్రుష్టిలో పెట్టుకోవాలి
అతను సాదాసీదా రాజకీయ నాయకుడుకాదు. 
ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో నుంచి ఎదిగిన నాయకుడు. 
సంఘ్ పై  ఉండే వాళ్లకు చరిత్ర పట్ల ఒక అవగాహన ఉంది. 
అది మంచిదా చెడుదా అని చెప్పను గానీ,
అదే అవగాహన మోడీకీ ఉంది.
ఆ అవగాహన ఆధారంగా అతను పనితీరుంటుంది.
పైకి  జనతా జనార్ధన్, ఛే కరోర్ గుజరాతీ లాంటి కబుర్లు చెప్పినా,
నరేంద్ర భాయ్ అంతిమ లక్ష్యం సంఘ్ ఏజెండానే.

దాన్ని గుజరాత్లోని మెజార్టీ ప్రజలు సమర్థిస్తున్నారు. 
మరి దేశంలోని మెజార్టీ ప్రజలూ సమర్థిస్తారా లేదా అన్నది
కాలమే నిర్ణయించాలి.




Tuesday, 18 December 2012

ఎటూ వెళ్లనీలేదు ఇళయరాజా


ఇళయరాజా సంగీతం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.

ఐతే ప్రపంచంలో పతీవోడికీ ఓ ఓపినియన్ ఉంటుంది.

దీన్ని  ఎవరూ కాదనలేదు. మరి నా ఒపినియేటంటే..



ఎటో వెళ్లి పోయింది మనసు సినిమాకు ఇళయరాజా
బదులు రెహమాన్ సంగీతం చేసుంటే బాగుండేది.

బ్యాగ్రౌండ్ స్కోరు కూడా  బాలేదు. దీంతో చాలా సీన్లు తేలిపోయాయి.

అసలీ సినిమాకి ఇళయరాజాను తీసుకోవడమే గౌతమ్ మీనన్ చేసిన తప్పు.

Monday, 17 December 2012

నామం పెట్టు నామం పెట్టు దేశానికి

ఏరా స్కూలుకు  ఎందుకు రాలేదు
కడుపులో నొప్పి మేడం.

ఏం దేవేందర్.  చిల్లరచర్చలో 
ఓటేందుకెయ్యలేదు

ఒంట్లో నలతగా ఉంటేనూ..
అయినా బాబు గారికి లీవు లెటరిచ్చానే, మీకివ్వలేదా.


సుధా నీ సంగతి
మా ఇంట్లో వాళ్లకు వంట్లో బాలేదు. అందరికీ జొరం. నిజ్జెం

చౌదరి నీకేం పోయే కాలం.
 వేళకి పోయే విమానం దొరకలేదు. అమ్మతోడు... దొరికుంటేనే..
 

 

నమ్మాలి, కట్టుకథలు నమ్మాలి, 
దేశానికి నిలువు నామాలు పెట్టే వాళ్లనీ,
చిల్లరపనులు చేసి పెద్దలుగా చెలామణీ అయ్యేవాళ్లనీ, 
ప్రజాస్వామ్యాన్ని టోకున బేరం పెట్టేవాళ్లనీ
నమ్మాలి. అయినా నమ్మితే పోయేదేముంది. 

గిరీశాన్ని జైల్లో పెట్టాలి.. ఇట్లు గుమ్మడికాయ దొంగలు

నిజం చెబితే నిష్టూరమాడతారు.  కట్జూపైనా అలానే నిష్టూరమాడారు  చాలామంది. అయినా  వెధవ, సన్నాసంటే  ఎవరికైనా మంట పుట్టడం సహజం. అందుకే  మంట పుట్టినోళ్లంతా ఎంత మాట, ఎంత మాటంటూ  కారాలూ మిరియాలూ,  ఆవాలూ జీలకర్ర , ఇలా ఏది దొరికితే అది నూరేశారు కట్టూపైన. అంతగా మంట పుట్టనివాళ్లు మాత్రం, కట్టూ చెప్పిన  శాతానికి  వెంట్రుకలు పీకారు. ఉంటే గింటే  60, 70 శాతముంటారేమో కానీ.. మరీ 90 శాతముండరనీ.  కావాలంటే 2001 జనాభా లెక్కలు ఓసారి తిరిగేయాలని కట్టూ గారికి సూచించారు. గుమ్మడికాయ దొంగలు మాత్రం ఊరుకోలేదు. తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ పక్క భుజాలు తడుముకుంటూనే మరోవైపు  కట్జూని  కఠినంగా శిక్షించాల్సిందేనంటూ కోర్టు తలుపులు దబదబా బాదేరు.  నిజమే గుమ్మడికాయల దొంగలు చెబుతున్నట్లు కట్టూని శిక్షించాల్సిందే.  ఐతే అంతకుముందు ఇంకో వ్యక్తినీ  శిక్షించాలి. ఆ వ్యక్తి పేరు గిరీశం. అవును కన్యాశుల్కంలోని గిరీశమే. ఎందుకంటే కట్టూ గారు తిట్టింది తాజాగానే.  కానీ వంద సంవత్సరాల క్రితమే  ‘మన వాళ్లు వఠ్ఠి వెథవాయిలోయ్’ అని కన్యాశుల్కంలో  గిరీశం తేల్చేశాడు. పైగా  కట్టూలా పదిశాతం డిస్కౌంటూ ఇవ్వలేదు. సో గిరీశం గారూ.. ఎక్కడున్నా వెంటనే లగెత్తుకొని రండి. మధురవాణి దగ్గరున్నాను, ఛార్జీలకు కాపర్స్ తక్కువయ్యాయి.. అంటే కుదరదు. మీ శిష్యుడు వెంకటేశం దగ్గర అప్పు తీసుకునైనా  రావాలి. ఇది గుమ్మడికాయ దొంగల డిమాండు.


Sunday, 25 November 2012

అధికారమిస్తే మీ ఇంట పెద్ద కొడుకునవుతా; చంద్రబాబు


సంగారెడ్డి, నవంబర్ 25 (ఆంధ్రజ్యోతి) : టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోకపోతే గత ఎన్నికల్లో తామే గెలిచేవారమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను చెప్పిన విషయాలపై ఆలోచించి,వాస్తవమని నమ్మితే తనకు సహకరించాలని ప్రజలను కోరారు. "తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంటికి పెద్దకొడుకులా మీ జీవితాల్లో ఆనందం నింపుతా''నని చంద్రబాబు హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలో ఎనిమిదో రోజైన ఆదివారం ఆయన మనూర్ నుంచి నారాయణఖేడ్ వరకు 9 కిలోమీటర్లు నడిచారు.

Wednesday, 21 November 2012

ఇది చదవండి.. జైలుకు వెళ్లండి

శ్రీక్రిష్ణ జన్మస్థానానికి వెళ్లడమంత సులభం కాదు. 
దానికీ కళాపోసనుండాలి. చానా శ్రమపడాలా.
గోడలు దూకాలా, తలుపులు బద్దలుకొట్టాలా,
పీకలు నరకాలా. ఇంకా చానా చానా చేయాలి
కనీసం అవినీతి చేసి జైలుకెళ్లాలన్నా..  బుర్రకు పనే
కాబట్టి  జైలుకెళ్లడం అందరూ అనుకునేంత ఈజీ  మాత్రంకాదు.


కానీ..

చెమటోడ్చకుండా. సిన్న రక్తం చుక్క సిందించకుండా 
గాంధీ మార్గంలో అహింసాయుతంగా  
మీ ఇంట్లోని కంప్యూటర్ ముందు నుంచి సరాసరి
 జైలుకెళ్లే మార్గం కూడా ఉందండోయ్
ఇందులో మీకు నొప్పి ఉండదు. 
బుర్రకూ పని చెప్పక్కర్లేదు

చేయాల్సిందలా... ఇది చదవడమే



Earlier this month the BBC alleged on a news program that a former Tory politician was a child molester. The report, which didn’t actually name the man, was untrue.
But a frenzy of speculation began on Twitter, with thousands of people either tweeting or retweeting the name of Alistair McAlpine — a.k.a. Lord McAlpine, an adviser to Margaret Thatcher when she was prime minister. The BBC has since apologized for sloppy reporting and coughed up £185,000 ($294,000) in damages. But some of those who tweeted about it are facing a probable lawsuit.
Those who repeated the claim include everyone from ordinary tweeters with few followers to high-profile celebrities like British actor Alan Davies with hundreds of thousands of followers. The media is reporting that some 10,000 people could be sued, leading to the largest number of defendants in a case in British legal history.
Of course many of those people were merely doing what most people do on Twitter: passing along gossip, the way they would on Facebook, by text message or by email. But unlike those, Twitter is completely public.
“Twitter is not just a closed coffee shop among friends,” says Andrew Reid, McAlpine’s lawyer. “It goes out to hundreds of thousands of people and you must take responsibility for it. It is not a place where you can gossip and say things with impunity, and we are about to demonstrate that.”
There’s a good chance he’s right, say other libel lawyers. The case has precedence. Earlier this year, Chris Cairns, a professional cricketer, went on trial for match fixing. He was cleared. Cairns turned around and sued for libel a former Indian Premier League chairman, Lalit Modi, who had tweeted about Cairns’ alleged involvement in match-fixing. A judge in London ruled against Modi and awarded Cairns £90,000.
Libel lawyers say the same rules apply in the McAlpine case, and it won’t matter if tweets outright accused McAlpine of child molestation or passed along the BBC report like party gossip.
“All tweeters are equally liable,” says Cairn’s lawyer, Rhory Roberton of Collyer Bristow. “Tweeters who don’t think about what they are doing are vulnerable by nature. Some would say stupid.” More than two dozen people who tweeted the news have reportedly come forward, apologized, and paid a nominal fee to go to charity. But others may not get off so easily.
Over the past year, a number of lawsuits have suggested that Twitter is fair game as a public forum in the eyes of lawyers and judges. One case gained attention perhaps because it sought $1 million in damages for a single tweet and a posting on a not particularly popular blog.
It involved an Oregon woman who blogged and tweeted allegations about a plastic surgeon’s sexual conduct. The doctor had been disciplined in the past for “intimate physical contact” and for suggesting it could serve as pay for treatment, but his public reprimand made no mention of sex. The case was later dropped by the doctor, reported the Oregonian.
Often cases have involved high-profile types who really ought to know better (or at least should be better advised). The musician Courtney Love has been sued at least twice, once by her own former lawyers, over vitriol spewed via Twitter. An NBA referee sued the Associated Press for defamation resulting from a tweet sent by a sports writer suggesting he’d made a bad call to make up for an earlier bad call.
The libel case involving Love and her former lawyers is still ongoing, but the other suits were ultimately dropped or settled. The executive director at the Media Law Resource Center says that as far as the center is aware, no other libel case about something published on Twitter has made it into a US courtroom.
In the UK, at least one Twitter-related case has led to a conviction, though for threats, not libel: In 2010, a man posted a tweet saying he would blow up a South Yorkshire airport if it didn’t reopen soon.
He later said it was a joke: He wanted to see a girl (whom he had met via Twitter) and couldn’t fly out because of a snow closure. The judge didn’t see it that way and fined him roughly £1,000 including costs. The ruling was, however, overturned this past summer, when judges ruled that the tweet wasn’t menacing after all.
But as Twitter becomes more widely used, not just by ordinary people but also by media organizations, such cases are bound to proliferate. Indeed, Twitter exposes traditional media to a kind of risk they’ve never encountered before: The internet can take something that wasn’t a libel and turn it into one.
In the BBC case, McAlpine was not named on Newsnight. The provable defamation happened only when people started guessing at his identity and tweeting his name. Says libel lawyer Robertson, “Had no one tweeted, the BBC would have had an argument that McAlpine was not identified, and thus his claim in libel against them would fail.”








Tuesday, 20 November 2012

చంద్రబాబు కొత్త నినాదాన్ని నమ్ముదామా


ఒక్క రోజు మీరివ్వండి(పోలింగ్ రోజు)..
ఐదేళ్లు మీకు మంచి పరిపాలన అందిస్తా

చంద్రబాబు తాజా నినాదం. బాగుందికదూ.


Monday, 19 November 2012

చీర కట్టుకుంటే...




చీర వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట.

ఈడ చదువుకోండి

Saree cancer

From Wikipedia, the free encyclopedia
Jump to: navigation, search
Saree cancer is a type of skin cancer that occurs along the waistline in females wearing the saree, caused by constant irritation which can result in scaling and changes in pigmentation of the skin. It is a rare type of cancer and generally found in the Indian subcontinent, where the saree is a lifetime female costume.[1] It is similar to Marjolin's ulcer in etiology, involving chronic inflammation.

Etiology

Saree tightened around the waist. A man wearing a dhoti is seen in the background.
The Saree is common female attire in the Indian subcontinent. It is a piece of long (generally 5.5 metres (18 ft)) cloth which can be made of various materials: cotton, silk, nylon, chiffon or synthetic fabric. It is worn over an inner skirt (petticoat) which is tightened around the waist by a thick cotton cord. This is the traditional costume of most Indian women. The saree is attached to the waist throughout the day in the hot and humid climate. The waist is often soiled with dust and sweat and remains without proper cleaning. This causes changes in pigmentation and mild scaling over the waist. This, in turn, causes chronic irritation and gradually malignancy may develop in the skin at the waistline.[2][3][4]

Signs and symptoms

The foremost symptoms of saree cancer is the constant irritation with scaling and pigmentation change at the waistline; gradually these become chronic. The person may have non-healing ulcer or a hyper- or hypopigmented patch or a growth-like lesion over the waistline. The lesion may be associated with serous discharge with foul smell.[2][3]

Management

Excision biopsy is required to confirm the diagnosis of saree cancer. In many cases local excision with skin grafting is considered the appropriate treatment.[2][3][1] Different ways of wearing the petticoat may help saree-wearers to prevent saree cancer. Some such strategies are:
  • loosening the petticoat
  • Changing the usual rope-like belt to broader ones that reduce pressure on the area
  • continually changing the level at which the petticoat is tied[1]

History of the disease

Women commonly wear the saree for their entire lifetime
In 1945 physicians Khanolkar and Suryabai described a new type of skin cancer with hypopigmented and thickened scars which were more likely to progress into malignant lesions. They termed it "dhoti cancer", the dhoti being a traditional male costume of India which like the saree is wrapped around the waist. The term "saree cancer" was first used by a group of doctors led by Dr. A.S. Ptil from Bombay Hospital, India, in the Bombay Hospital Journal. The dermatological problem in the waist of Indian women wearing sarees had been recognised before by some other researchers. This type of cancer is now related to Marjolin's ulcer, the malignant degeneration of a chronic wound which was described by Jean-Nicolas Marjolin in 1828.[2][3]

References

నాయనా, పయ్యావులా కలత చెందకు

పయ్యావుల కేశవ్  జగన్ పార్టీలోకి వస్తున్నాడని ఓ పత్రికలో వార్త వచ్చింది

మామూలుగా అయితే  ఆ వార్తను తీవ్ర పదజాలంతో  పయ్యావులు ఖండించాలి

కానీ ఏం చేశాడంటే

ఏడ్చాడు. బాధపడ్డాడు. 
కన్నీరు పెట్టుకున్నాడు. 
కర్చీఫ్ తో  మొహం తుడుచుకున్నాడు.

టీవీ చూస్తున్న నాకు బుర్ర పాడైపోయింది. 

కేశవ్కు ఏదో అయిపోయిందనుకున్నా

తీరా చూస్తే...  రాజకీయనాయకులకు అలవాటైన తిరకాసువార్తే.

అయినా కంటనీరు ఒలికించాడంటే,

పాపంఎంత బాధపడి ఉంటాడో

బాధపడకు కేశవ్. 

ఇది పాడులోకం. 

పాపిష్టి లోకం. 
  











చేతిలో కలముందని, ఎదురుగా ఇంటర్నెట్ ఉందని



రాయకండి రాతలు
చేయకండి విమర్శలు

ధిక్కారస్వరాలు వినిపించాలని,
దిక్కులు పిక్కటిల్లేలా  అరవాలని
అభిప్రాయాలను వెల్లడించాలని
సమాజాన్నిచైతన్యవంతం  చేయాలని
లోగుట్టులు విప్పాలని,
పైపై మెరుగుల బండారాన్ని బయటపెట్టాలని
ప్రయత్నించకండి.
మౌనంగా ఉండండి.
చాతకాకపోతే
కాస్త  మత్తు మందు తాగండి.
వేయి ఆలోచనలను
వేల దురాగతాల్ని
మీ గొంతులోనే సమాధి చేయండి.


చేతిలో కలముందని.
ఎదురుగా ఇంటర్నెట్ ఉందని,
రాజ్యాంగం స్వేఛ్చ ఇచ్చిందని,
రాత నా జన్మహక్కని
ప్రపంచంలోని అతిగొప్ప
ప్రజాస్వామ్యంలో పౌరుడినని
నాకు ఎదురేలేదని
విర్రవీగావో..

అదిగో అసీమ్ త్రివేది.
 బందిఖానాలో... సంకెళ్లతో




 నోట్;  అసీమ్ త్రీవేది జైలు కు వెళ్లినప్పడు ఈ టపా రాశాను. ఇప్పడు ముంబయిలో ఇద్దరమ్మాయిల అరెస్టు నేపథ్యంలో మళ్లీ  ఈ టపాను  పోస్టు చేస్తున్నాను.







Thursday, 11 October 2012

ఎవరికి ఎక్కువ నష్టం. బాబుకా, జగన్కా

కంచిలో దండేస్తారని కాళహస్తి నుంచి 
ఒంగోని పొయాడట  వెనకటికి ఒకాయన. 
అలానే ఉంది ఇప్పడు బాబు యాత్ర గానీ, 
జగన్ పార్టీ తలపెట్టబోతున్న యాత్ర  గానీ, 
ముఖ్యమంత్రి  ఇందిరమ్మ బాట గానీ. 


2014  ఎన్నికల లక్ష్యంగానే
వీళ్లంతా యాత్రలు చేస్తున్నారు.
 యాత్రలే ఎందుకు చేస్తున్నారంటే
ఇదిగో ఈ కింది కారణాలు వారికున్నాయ్


2004 ఎన్నికలకుముందు 
వైఎస్ పాదయాత్ర చేశాడు. 
అధికారంలోకి వచ్చాడు.

అద్వానీ రధయాత్ర చేశాడు.
రెండు సీట్లున్న కమలానికి 
అధికారం అందించాడు

1983లో ఎన్టీయార్ చైతన్యరథంపై తిరిగాడు.
విజయబావుటా ఎగరేశాడు

మొన్నటికి మొన్న ములాయం కొడుకు 
సైకిల్ యాత్ర చేశాడు. పగ్గాలు చేపట్టాడు.

ఇవన్నీ చూసిన తర్వాత
యాత్రలకు అధికారం రాలుతుందని 
నమ్మకం ఏర్పడింది నాయకులకు

ఆ నమ్మకమే 63 ఏళ్ల చంద్రబాబును నడిపిస్తోంది.

ఆ నమ్మకం జైలుకు వెళ్లకముందు యువ జగన్ను నడిపించింది.

ఐతే ఇక్కడ ప్రశ్నేంటంటే  ఎవరి యాత్రకు  అధికారం రాలుతుందనేదే

ఇప్పటికే చంద్రబాబు యాత్రకు రూ. 100 కోట్లు ఖర్చని వార్తలొచ్చాయి.

రేపు జగన్ పార్టీ చేసినా అంతే అవుతుంది.

ఇంత ఖర్చు చేసినా  రేపు ఫలితం దక్కకపోతే...  

ఎవరికెక్కవ నష్టం.

చంద్రబాబుకా, జగన్ పార్టీకా 






Tuesday, 9 October 2012

ఎన్నాళ్లని చంద్రబాబును హింసపెడతారు


ప్రతిపక్ష నాయకులను నియంత్రించడానికి
 కాంగ్రెస్ వేసే వెధవ్వేషాలు అందరికీ తెలిసిందే.

ఎప్పటిదో ఐఎమ్జీ భూముల కేసు. 
దాన్ని తేల్చరు, నాన్చరు.

రాజకీయంగా అవసరం లేనపుడు  
ఐఎమ్జీ  పై మౌనంగా ఉండే కాంగ్రెస్
తేడా వస్తే, అదిగో సీబీఐ అంటూ
భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.

సీబీఐ నోటీసులు కూడా చిత్రంగా  విడుదలవుతుంటాయి

నిన్న మాయావతి యూపీలో బహిరంగ సభ పెట్టి  
ఎఫ్డీఐలకు వ్యతిరేకమని చెప్పింది.యూపీఏపై పోరాడతమంది. 
వెంటనే అక్రమాస్తుల కేసులో సీబీఐ నోటీసులు పంపింది.

యూపీ గవర్నర్ ఆమోదం తెలిపితే
మాయాపై సీబీఐ దర్యాప్తు మొదలవుతుంది. 

చిత్రమేంటంటే అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 
లాలూ,ములాయం ఊసు మాత్రం  ప్రస్తుతానికి ఎత్తదు సీబీఐ


మొన్న గడ్కరీ  ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు
ఇంత గందరగోళమున్నా 
ఎందుకు యూపీఏ  పడిపోవడం లేదంటే
ప్రభుత్వాన్ని ఒకే ఒక వ్యక్తి కాపుకాస్తున్నాడని చెప్పాడు.

ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే సీబీఐ డైరెక్టరట.



Monday, 8 October 2012

వాద్రా ప్రైవేటు పౌరుడైతే.. జగన్ ఏమవుతాడు

డీఎల్ ఎఫ్  ప్రభుత్వం నుంచి భూములు తీసుకుంది 
సోనియా గాంధీ అల్లుడికి కారుచౌకగా తన ఆస్తులను కట్టబెట్టింది.


నిమ్మగడ్డ అండ్ కో  ప్రభుత్వం నుంచి సాయం పొందింది. 
తర్వాత రాజశేఖరరెడ్డి కొడుకు జగన్కు సంబంధించిన సంస్థల్లో
చాలా తక్కువ ప్రీమియంకే షేర్లు కొనుగోలుచేసి పెట్టుబడులు పెట్టాయి. 

రెండింటికి తేడా ఏంటో చిదంబరం సారే చెప్పాలి. 

ఒకరిని అవే ఆరోపణలపై జైల్లో పెట్టినప్పడు.. 
మరోకరిపై కనీసం దర్యాప్తు కూడా చేయమని తెగేసి చెప్పడమేంటి








Saturday, 6 October 2012

ఆరోపణలపై ఆరోపణలు చేయరట

అధికారం కావాలి.కానీ అధికార పక్షాన్ని ఏమీ అనరట. ఎంత సిత్రం చూడండి. కేజ్రీవాలా అన్న ఓ వ్యక్తి వాద్రాపై ఆరోపణలు చేస్తే.. వాటిలో నిజమెంతో అబద్దమెంతో తేల్చాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండు చేయడం మానేసి..  కేజ్రీవాలావి  ఆరోపణలే... అందుకే వాటిపై బీజేపీ పెద్దగా స్పందించ లేదని గడ్కరీ  ఐబీఎన్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ కు మిత్రులకు కొరతలేదన్నవిషయం అర్థమవుతుంది.



ఇప్పటికే  మహారాష్ట్ర ఇరిగేషను స్కీము స్కాములో గడ్కరీ పేరు మునుగుతూ తేలతా ఉంది.  కాంగ్రెసోళ్లు కూడా  గడ్కరీపై  గట్టిగా దాడి చేయడం లేదు. అందుకు ప్రతిఫలంగానే  గడ్కరీ సాబ్.. వాద్రా ఘటనపై మౌనంవ్రతం పాటిస్తున్నారన్న గుసగుసలూ ఉన్నాయి. నిజం పెరుమాళ్లకెరుక


Friday, 5 October 2012

జగన్ జైల్లో ఉంటే.. వాద్రా ఎక్కడుండాలి

రాజశేఖరరెడ్డిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించాడన్న ఆరోపణలపై జగన్ జైల్లో ఉన్నాడు.
సోనియాగాంధీని అడ్డంపెట్టుకొని అల్లుడు వాద్రా సంపాదించాడని ఇప్పడు ఆరోపణలు వస్తున్నాయి.
మరి అల్లుడు వాద్రా ఎక్కడుండాలి.
నిజానికి వాద్రాపై కేజ్రీవాలా ఆరోపణలకు కొత్తవి కావు.
ఏడాది క్రితమే డీఎల్ఎఫ్-వాద్రా మిలాఖాత్పై టైమ్స్ ఆఫ్ ఇండియా  కథనాలు ప్రచురించింది.
ఎవరూ పట్టించుకోలేదు. ప్రతిపక్షమైన బీజేపీ కూడా మౌనందాల్చింది.
ఇప్పడు కేజ్రీవాలా మళ్లీ  అవే ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది.
అయితే ఇప్పడు ప్రశ్నల్లా ఆరోపణలపై విచారణ జరుగుతుందా అనేదే
ఎందుకంటే దేశానికి న్యాయశాఖ మంత్రి అయిన ఖుర్షీద్ గారు...
టీవీ ఛానళ్ల ముందు సోనియాగాంధీ కుటుంబానికి వకీల్లా మాట్లాడారు.
న్యాయశాఖమంత్రిగా ఆరోపణలపై విచారిస్తామని చెప్పాల్సింది పోయి
 అమ్మగారి కుటుంబంపై ఈగ వాలితే సహించమన్న రీతిలో  మాట్లాడడం చూస్తుంటే
అల్లుడిగారిపై విచారణ జరుగుతుందనుకోవడం భ్రమలానే కనబడుతోంది.


Thursday, 20 September 2012

ఏంటి మద్దతిస్తారా లేదా

తప్పు కేజ్రీవాలాదా లేదా అన్నాదా అని ఎంచడం ఆపాలి
ఇద్దరూ వేర్వేరు దారులను ఎంచుకున్నారు
ఆ దారుల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారు.
అన్నా.. దీక్షల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలనుకుంటున్నారు.
కేజ్రీ.. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ప్రవేశించి
మన జేపీలా కుళ్లును కడిగేయాలనుకుంటున్నారు.
జేపీ కూడా ముందు లోక్సత్తా ఉద్యమం ప్రారంభించి
 ప్రజలను చైతన్యవంతులను చేశాడు.
ఆ తర్వాత పార్టీ పెట్టాడు. ప్రజలను ఓట్లడిగాడు..
అంతగా విజయవంతం కాలేకపోయాడు.
మరి కేజ్రీవాలా కూడా మరో జేపీలానే మిగిలిపోతాడా.
లేక జేపీ కంటే ఎక్కువడగులు వేస్తాడా
నిజానికి సంప్రదాయ పార్టీల పోటీ తట్టుకొని
 జేపీ, కేజ్రీల్లాంటివాళ్లు నిలబడడం కష్టం
కానీ ఎక్కడో ఒక దగ్గర ఓ అడుగుపడాలి. 
ఆ అడుగు ధైర్యంగా మొన్న జేపీ వేసాడు. ఇప్పడు కేజ్రీ వేస్తున్నాడు.
వీరిద్దరికి మనం మద్దతివ్వాల్సిన తరుణం ఆసన్నమైంది.

Sunday, 16 September 2012

అసలీ స్వేచ్ఛుంటుందా


ఎఫ్డీఐలొస్తే  కోట్ల ఉద్యొగాలొస్తాయి. ఒప్పుకుంటాం.
యువతకు ఉపాధి పెరుగుతుంది నమ్ముతాం.
రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది విశ్వసిస్తాం
కానీ తర్వాత ఏమవుతుంది
తెరవెనుక ఏమవుతుంది.

తీపికబుర్ల  వెనుక చేదు సంగతేంటి.
ఉపాధి మాటున జరిగే దోపిడి సంగతేంటి.
భవిష్యత్తు తరానికి జరిగే నష్టం మాటేంటి.


నాడు కూడా అంతే.  వర్తకానికి వచ్చారు బ్రిటిషర్లు
తర్వాత ఏమైంది. శతాబ్దాల బానిసత్వం
నేడది  జరగదని గ్యారంటీ ఇవ్వగలరా.
ఇచ్చినా  ఆ గ్యారంటీ గడువెంతవరకు
నా వరకా.. నా కొడుకు తరం వరకా
ఆ తర్వాతి తరం పరిస్థితి
వారికీ దేశ వనరులపై హక్కుంటుందా
అసలప్పటివరకు రైతుంటాడా.
వాడికి పొలముంటుందా
ఈ భూమి,
ఈ నేల,
ఈ గాలి..
అసలీ స్వేచ్ఛ ఉంటుందా



Thursday, 13 September 2012

ఎంతండి..ఏడడగుల నాలుగు అంగుళాలే


కుక్కా ... గుర్రమా
 ప్రపంచంలో అతి పొడవైన కుక్క ఇదేనట.ఎక్కడుంటుంది. ఎవరుపెంచుతున్నారు వగైరా వగైరా లాంటి విషయాలు కావాలంటే ఇదిగో ఇక్కడ క్లిక్ చేయండి



ఆరుదాటితే మీ సిలండరు పేలుతుంది


మాది పేలదు.
మాకు ఆరు సరిపోతాయి.
పక్కింటోడిది పేలిపోతుంది.
వాడికి  ఏడాదికి 12 కావాలి.

మాది పేలదోచ్
పక్కింటోడిది పేలిపోతుందోచ్
తలుచుకుంటేనే  రోమాలు....
నేనే ఇంత పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తుంటే
రాష్ర్టంలో కోటిన్నరమందిది పేలనుందన్న వార్తకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో సంబరాలు చేసుకుంటుందో


జగన్ విషయంలో కాంగ్రెస్ రూటుమారుస్తుందా


ఎర్రంనాయుడి ఆవేదనను బట్టి మారుస్తుందనే  అనుకోవాలి.

జగన్ కేసులో  సీబీఐ తరఫున వాదిస్తున్న న్యాయవాదులను కేంద్రం మార్చిందట.

దీని వెనుక  కేంద్ర న్యాయశాఖ పాత్ర ఉందని నాయుడంటున్నారు.

నిజం  సోనియమ్మకే ఎరుక

Wednesday, 12 September 2012

సూట్కేసులు మారితే ఏమవుతుంది

సూట్కేసులు మారితే
ఏమవుతుంది.
యాజమాన్యకోటా అన్లైన్ నుంచి తుర్రుమంటుంది.

తెలుసు ప్రభుత్వానికి ముందే
వెనకటి తేదీలతో ఇచ్చిన జీవోలు చెల్లవని.
కోర్టులో కేసు నిలవదని
యాజమాన్యాలు కోటా సీట్లు అమ్ముకుంటాయని

అయినా  ఓ నమ్మించే ప్రయత్నం.
అయినా ఓ దగా చేసే యత్నం.
అంతా చేశాం.. కానీ
అదిగో కోర్టులంటూ నెపం న్యాయవ్వవస్థపై నెట్టే కుతంత్రం.


రాజు ఎవడైనా మోసం చేసే తరీఖా ఒకటే
ప్రజలెవరైనా మోసపోయే తరీఖా ఒకటే

నాలుగు మంచిమాటలు
మూడు రోజులు పత్రికల్లో అనుకూల వార్తలు
ఆనక  ఇదర్ కాసూట్ కేసు.. ఉధర్
 ఉదర్ కా సూట్కేసు ఇదర్










ఎంత గొప్పవాడివయ్యా


కొడవటిగంటి రోహిణి ప్రసాద్
అయన  గురించి   నాకు తెలిసిందే  తక్కువే. 
అప్పడుప్పడు ఈ మాటలో అతని వ్యాసాలు చదివే వాడిని.
సైన్ను నాకిష్టం లేని విషయమే అయినా 
ఆసక్తిగా చదివేవాడిని  ఆ వ్యాసాలను
చందమామ కథల్లా ఉండేవి.  
ఈ వ్యాసాలన్నీప్రజలకు చేరితే 
ఎంత అగ్నానం పోతుందీ లోకం నుంచి అనుకునేవాడిని.
కానీ ప్రజలకు చేరలేదు. అగ్నానం పోలేదు.
ఆయన పోయారు.

చేతిలో కలముందని, ఎదురుగా ఇంటర్నెట్ ఉందని

రాయకండి రాతలు
చేయకండి విమర్శలు

ధిక్కారస్వరాలు వినిపించాలని,
దిక్కులు పిక్కటిల్లేలా  అరవాలని
అభిప్రాయాలను వెల్లడించాలని
సమాజాన్నిచైతన్యవంతం  చేయాలని
లోగుట్టులు విప్పాలని,
పైపై మెరుగుల బండారాన్ని బయటపెట్టాలని
ప్రయత్నించకండి.
మౌనంగా ఉండండి.
చాతకాకపోతే
కాస్త  మత్తు మందు తాగండి.
వేయి ఆలోచనలను
వేల దురాగతాల్ని
మీ గొంతులోనే సమాధి చేయండి.


చేతిలో కలముందని.
ఎదురుగా ఇంటర్నెట్ ఉందని,
రాజ్యాంగం స్వేఛ్చ ఇచ్చిందని,
రాత నా జన్మహక్కని
ప్రపంచంలోని అతిగొప్ప
ప్రజాస్వామ్యంలో పౌరుడినని
నాకు ఎదురేలేదని
విర్రవీగావో..

అదిగో అసీమ్ త్రివేది.
బందిఖానాలో... సంకెళ్లతో










Saturday, 8 September 2012

తెలంగాణవాది, సమైక్యవాది రాసుకుంటే


ఒక తెలంగాణ వాది.. ఒక సమైక్యవాది భుజం భుజం రాసుకుంటే ఏం వస్తుంది.

దేవేందర్ గౌడ్, యనమల రామక్రిష్టుడు కలిసి తెలంగాణ లేఖ రాస్తే ఏమవుతుంది.

రాష్ట్రం ముక్కలవుతుందో , కలిసి ఉంటుందో చెప్పలేం గానీ.. 

తెలుగుదేశం స్పష్టత జాబితాకు  మాత్రం సంపూర్ణత్వం వస్తుందని చెప్పొచ్చు.


అసలు తెలుగుదేశం పార్టీ ద్రుష్టిలో స్పష్టత అంటే ఏంటి.


రెండు రూపాయలకు కిలో బియ్యం..   ఇది పాత హామీనే.

దీన్నే మళ్లీ చెబితే...  స్పష్టత ఇచ్చినట్లన్న మాట.


వర్గీకరణకు  తెలుగుదేశం అధికారంలో ఉండగానే మద్దతిచ్చింది.

మళ్లీ ఒక్కసారి గట్టిగా చెబితే   స్పష్టత

ప్రణబ్ కు తెలంగాణ విషయంలో ఇంతకుముందే  లేఖిచ్చారు.. పాత విషయమే

మళ్లీలేఖ రాస్తే  స్పష్టతిచ్చినట్లు


అన్ని పాతవిషయాలే.. ఏంటి స్పష్టత అని అడక్కండి

అదే రాజకీయం

ఇక్కడ అస్పష్టతలో కూడా స్పష్టత స్రుష్టించబడును.








ఇదిగో పవన్ కల్యాణ్... అదిగో డేనా మార్క్

 పుకారు. ఎంత తొందరగా పయనిస్తుందో  ఇంటర్నెట్ యుగంలో అందరికీ తెలిసిందే. 

ఇదిగో పవనంటే అదిగో డేనా మార్కంటూ  క్షణాల్లో కథలు అల్లుకుపోతాయి

ఏది నిజం.. ఏది అబద్దమన్న  విచక్షణ ఉండదు. ఇంటర్నెట్ ఉన్మాదం  అవహిస్తుంది.

మన బ్లాగర్ల సంగతి తెలిసిందే.

ఇందులో కొందరు నిజాయతీగా రాస్తే చాలా మంది హిట్ల కోసమే రాస్తారు.

హిట్ల కోసం తాపత్రయ పడడంలో తప్పులేదు.  కానీ అందుకోసం తప్పుడు సమాచారమివ్వడమే తప్పు

రాసే విషయం చదివితే అది తప్పుడు సమాచారమని  పాఠకుడికి స్పష్టంగా అర్థం కావాలి

అనుకుంటున్నారట.. అన్న వార్త రాసినపుడే  అలానే రాయాలి. 

రాసింది నిజంగా జరిగినట్లు పాఠకుడు భావిస్తే మాత్రం  పుకారుకు ఆజ్యం పోసిన వాళ్లమవుతాం












Thursday, 6 September 2012

పత్రికలు.. పతివ్రతలు

పత్రికలు.. పతివ్రతలు


 


Published: September 7, 2012 03:12 IST | Updated: September 7, 2012 08:50 IST

Coalgate probe points the finger at four media houses

Sujay Mehdudia
Inter-Ministerial Group to submit report on September 15
Even as the Inter-Ministerial Group (IMG) held its first meeting on Thursday to listen to 10 of the companies that have been issued show-cause notice, investigation into Coalgate is pointing to at least four media houses being beneficiaries of the coal blocks allocation.
Sources in the government said that at least three print media publication houses and one electronic channel have benefited from the allocation of coal blocks by misrepresenting facts to secure critical coal assets.
“Investigations have revealed that these companies managed to bag coal blocks after floating front companies in order avoid exposing themselves directly in the allocation process. One of the publications has also floated a power generation company, and was beneficiary due to that linkage. One of the companies is understood to have been summoned by IMG during its three-day marathon meeting.”

CBI probe on

The matter is under investigation by CBI, and it is likely to file a formal complaint in the second phase of registration of FIRs,” a senior Coal Ministry official said.
On the other hand, Monnet Ispat and Energy, one of the 10 firms asked to appear before the IMG, informed the group that it had plans to begin production in its Utkal B2 coal block in Odisha by March 2013.

Work from March 2013

“We have estimated the production from this coal block to begin around March 2013,” Monnet Ispat chairman and managing director Sandeep Jajodia told reporters after meeting the IMG members.
The IMG has been asked to submit a report for de-allocation of blocks and encashing of bank guarantees of the captive mine owners by September 15.

Notice to company

Between 1999 and 2009, Monnet was allocated five captive mines. Of this, the IMG had issued notice to the company for the Utkal B2 block that was allocated on August 16, 1999, with an extractable reserve of 77 MT but is yet to begin production.

‘Monnet Ispat credible’

“I don’t know what decision the committee will take. I believe that we have given a good presentation and justified the reasons for the delay. I am sure the Ministry of Coal and rest of the people know that Monnet Ispat is a very serious player in the industry and a very credible company,” Jajodia said.
The IMG has summoned players like Usha Martin, Jindal Steel and Power Limited (JSPL), Visa Steel, Uttam Galva, Bhushan Steel, Orissa Sponge Iron & Steel, Electrosteel Castings and Adhunik Metaliks.

ఒక్క పుస్తకం .. వంద అలజడులు

 ఆంధ్రజ్యోతి కథనమిది

 

సగం మంది మంత్రులు ఢిల్లీకి
నేడు 'వైఎస్ డైరీ'లపై కేవీపీ పుస్తకావిష్కరణ
హస్తినకు బయల్దేరిన బొత్స

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ముల్లు గుచ్చుకుంది. ఇది... రాజకీయాల ముల్లు కాదండోయ్! నిజంగా ముల్లే. కర్నూలు జిల్లాలో ఇందిరమ్మ బాటలో ఉన్న ఆయన గురువారం మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీఎంతోపాటు ప్రముఖులు నడిచేందుకు ఆలయ అధికారులు కార్పెట్లు పరిచారు. అయితే... వాటిని శుభ్రం చేయడం మరిచారు. కార్పెట్‌పై ఉన్న ఓ ముల్లు సీఎం అరికాలుకు గుచ్చుకుంది. దీంతో ఆయన మంత్రి ఏరాసు భుజాన్ని ఆసరాగా చేసుకుని గుచ్చుకున్న ముల్లును తీసేసుకున్నారు.


హైదరాబాద్, సెప్టెంబర్ 6 : వీహెచ్ వాదన... అరణ్య రోదనే! పుస్తకావిష్కరణ పేరిట వైఎస్ వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలన్న ఆయన మొర 'ఒక్కండును... ఒక్కండును' ఆలకించలేదు. జగన్ పార్టీ తరఫున కేవీపీ కోవర్టుగా పని చేస్తున్నారని వాపోయినా అధిష్ఠానం పట్టించుకోలేదు. నేతలు... పోలోమంటూ ఢిల్లీకి పరుగులు తీస్తున్నారు. వైఎస్ తన పాదయాత్ర సందర్భంగా రాసుకున్న డైరీలకు ఆయన ఆత్మబంధువు కేవీపీ పుస్తక రూపం ఇచ్చి... శుక్రవారం దానిని ఢిల్లీలో ఆవిష్కరిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ఒకరూ ఇద్దరూ కాదు... రాష్ట్ర మంత్రివర్గంలో దాదాపు సగం మంది హాజరవుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గు లాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీతోపాటు మరికొందరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కూడా హాజరు కానున్నారు. కేవీపీ గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి ఈ పుస్తక ఆవిష్కరణ సభకు ఆహ్వానించారు. ఈ ఆహ్వాన పత్రికను ప్రధాని ఆసక్తిగా చదివారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులందరినీ కేవీపీ ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స గురువారం రాత్రే ఢిల్లీకి బయలుదేరారు.

శుక్రవారం మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వట్టి వసంతకుమార్, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, విశ్వరూప్, పొన్నాల, దానం, అహ్మదుల్లా, మాణిక్యవరప్రసాద్ ఢిల్లీ వెళ్లనున్నారు. సాక్షర భారత్ అవార్డును అందుకునేందుకు లక్నో వెళ్తున్న మంత్రి శైలజానాథ్ కూడా కేవీపీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మ రోవైపు... మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కిరణ్ ఇందిర మ్మ బాట షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది. ఇందుకో సం మంత్రి డీకే అరుణ శుక్రవారం సీఎం కిరణ్‌తో సమావేశం కానున్నారు. అది త్వరగా పూర్తయితే... ఆమెతో పాటు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశముంది. మంత్రి పార్థసారథి, సారయ్య ఢిల్లీకి వెళ్లడం లేదు. మరో మంత్రి డీఎల్ ఢిల్లీ వెళ్తున్నా అధిష్ఠానం పెద్దలను కలిసేందుకే ప్రాధాన్యమిస్తున్నారు.

చాణక్య చంద్రబాబు

ఫ్రంట్ పేజీలో  ఆంధ్రజ్యోతి కథనమిది


చంద్రబాబు యోధుడు
దళితుల్లో ఒక వర్గాన్ని ఆకర్షించారు
బీసీలనూ తనవైపు తిప్పుకున్నారు

ఈ వ్యూహాలు కాంగ్రెస్‌కు చేతకావు
ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది
సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీల వ్యాఖ్యలు
చంద్రబాబుతో ముగ్గురి భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కాంగ్రెస్ ఎంపీలు ఏమనుకుంటున్నారు!? వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు!? జగన్‌కు చెక్ చెప్పాలంటే ఏం జరగాలని భావిస్తున్నారు!? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే, ఓసారి పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు వెళ్లాల్సిందే!


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6 : గురువారం మధ్యాహ్నం సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. వాస్తవానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు అడుగంటి పోయాయని ఆ పార్టీ ఎంపీలే భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బలరాం నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం టీడీపీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఆ తర్వాత సెంట్రల్ హాల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. చంద్రబాబు తనకు రాజకీయంగా జన్మనిచ్చారని, నిజానికి కాంగ్రెస్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు అవుతుందని ఒక ఎంపీ వ్యాఖ్యానించగా.. అలా జరిగితే రెండు పార్టీలూ ఓడిపోతాయని, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఎ వరూ అడ్డుకోలేరని మరో ఎంపీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్సేనని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీల మధ్య కొంతసేపు చర్చ జరిగింది. "చంద్రబాబు ఫైటర్. ఒక యోధుడు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా అలుపెరగకుండా పోరాడుతున్నారు'' అని మరో ఎంపీ కితాబిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ రావడం కన్నా టీడీపీ అధికారంలోకి రావడమే మంచిదని, ఆ తర్వాత జగన్ పార్టీ మటుమాయమైపోతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎవరి పక్షం వహించాలా అన్న అం శంపైనా ఎంపీల మధ్య చర్చ సాగింది. బాబు మంచి వ్యూ హకర్త అని, దళితుల్లో అధికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళుతున్నారని గ్రహించి, వర్గీకరణకు మద్దతు పలికి, వారి లో ఒక వర్గాన్ని తన వైపునకు తిప్పుకొన్నారని, ఇప్పుడు బీసీలపై దృష్టి కేంద్రీకరించారని, కాంగ్రెస్‌కు ఇలాంటి వ్యూహాలు చేతకావని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. జగన్ మాదిరిగా బాబు మహా అవినీతిపరుడు కాదని, ఆయనకు రాష్ట్రం పట్ల స్పష్టమైన అవగాహన ఉందని, ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు.

బాబు పోతే కుర్చీలో లోకేశ్

సోనియా విదేశాలకు వెళితే తీన్మూర్తిలో రాహుల్
బాబు పాదయాత్ర కు పోతే ఎన్టీఆర్ భవన్లో  లోకేశ్
జగన్  జైలుకు  వెళితే అధ్యక్షపీఠంపై విజయమ్మ

వారసుల రాజ్యమిది.
వాతల రాజ్యమిది
















ఒక్క అక్షరం పోతే ఏమవుతుంది


Wednesday, 5 September 2012

మాకొక ఛానల్ కావాలిరా


మాకొక  ఛానల్ కావాలిరా....

సత్తిబాబు పాడుతున్నాడు.

ఉండేహ్.. నేను బేరమాడుతుంటే  మద్దెలో నీ సాంగులేటి

మేనల్లుడికి కోపం వచ్చింది.


మాకొక ఛానల్ కావాలిరా

చిరంజీవి  అందుకున్నాడు.

చూడు బామ్మరిది

అదే పనిలో ఉన్నాను. అట్టే అరవకు

బన్నీ కొత్త ఇల్లు  పూర్తికాగానే  నీ పనే

అరవిందు అభయం


మాకొక ఛానల్ కావాలిరా

కాంగ్రెస్ కార్యకర్త ఆర్తనాదం

చూడు కార్యకర్తా

డబ్బుల్లేవు. డిపాజిట్లు లేవు

అమ్మగారు విదేశాల నుంచి

నిధులు తేగానే కొబ్బరికాయ  కొడతాం

కాంగ్రెస్ నాయకుడి బుజ్జగింపు


తెలుగు నాట భక్తిరసం తెప్పలుగా  పారుతోంది
డ్రైనేజీస్కీము లేక డేంజరుగా మారుతోంది అన్నాడు గజ్జెల మల్లారెడ్డి


ఇప్పడు ఛానళ్ల పరిస్థతీ అలానే ఉన్నట్లుంది.










అన్నా.. సచినన్నా.. ఇదేందన్నా

23 ఏళ్ల నుంచీ ఆడుతున్నాడు.

పరుగులుచేస్తున్నాడు.

దేశాన్ని గెలిపిస్తున్నాడు.

ఇప్పడు వయసు 40

కాస్త ఆట గాడి తప్పింది.

మూడు మ్యాచ్ లలో  క్లీన్ బౌల్డయ్యాడు.

ఎవరూ కారా.

కానీ ఎవరూ ఎప్పడూ కానట్లు.
 భూమి బద్దలైనట్లు
కొంపలు మునిగిపోయినట్లు
భారత క్రికెట్కు అంతిమ ఘడియలు
సమీపించినట్లు
కొందరు రంకెలేస్తున్నారు

రిటైర్ కావాలని

ఇంకెనాళ్లని

కుర్రాళ్లకి ఛాన్సివ్వవా అని

కూతలు చాలానే.

కూస్తున్నారు ఘనంగా

మర్చిపోయారు నాడు కురిసిన హిమ సమూహాలు

మర్చిపోయారు నాడు మెరిసిన శతకాలను

మర్చిపోయారు నాడు హోరెత్తిన స్టేడియాలను

మర్చిపోయారు నాడు చేసిన జపాలను.


ఏంతైనా భారతీయులు క్రుతఘ్గ్నలే.

చేసిన మేలు తొందరగా మర్చిపోతారు.
విశ్వాస ఘాతకులు


అయినా అన్నా...ఇవన్నీ తాటాకు చప్పళ్లే.
అదరకు బెదరకు
బీసీసీఐ నిన్నేమీ అనలేదు.
సెలక్టర్లు గురించి తెలిసిందే.


ఆడు... ఆస్వాదించినన్నాళ్లూ ఆడు.
ఆట ఆగేవరకు ఆడు.
నీ బ్యాటు... నీ ఇష్టం.




కందకు లేని దురద

సారీ సెలెక్టర్లకు లేని దురద

విశ్లేషకలుకు ఎందుకు

అప్పడెప్పడో మంజ్రేకర్  తోక జాడించాడు.

ఏమైంది

తోక ముడుచుకున్నాడు.
లెంపలేసుకున్నాడు.

ఇదిగో కావాలంటే చదవండి



అలా చేయండి బాబు గోరు.. యార్లగడ్డ ప్రెస్మీట్లు పెట్టడు

కూరలో కరివేపాకంటూ కరివేపాకుని చాలా తేలిగ్గా తీసేస్తారు.

రాజకీయాల్లో మూడో ఫ్రంట్ పరిస్థితీ కరివేపాకులాంటిదే.

మూదో ఫ్రంట్  పేరు వింటేనే ప్రజలకు మూడ్ రావడం మానేసి చాలా కాలమైంది.

అదే లాలూ, అదే బాబు.. అదే బర్ధన్, అదే దేవెగౌడ

పాతకాపులే. పాతసారానే. కానీ కొత్తగా కనిపించాలి.

ఏం చేయాలి. పేరు మారిస్తే పోలా.

అందుకే మూడో ఫ్రంట్ పేరు మార్చాలనే ఆలోచనలో ఉన్నారు నాయకులు


పేరేదైనా ఫర్వాలేదు. పేరులో మాత్రం మూడు  ఉండకూడదు.

ఇందుకోసం అటు ఇటు కాని చాలా పేర్లను ఇప్పటికే చర్చించారు.

పేరు విషయంలో బాబు మాత్రం ఓ షరతు పెట్టారట

మూడు తీసేసినా.. పేరులో ఫ్రంట్ మాత్రం ఉండాలట

అలా ముందుకు పోదాం అని ఎప్పడూ అనే  బాబూ ఏ పన్లోనైనా  ఫ్రంట్నే ఉండాలని తాపత్రయపడతారు.

ఈ మధ్య ఎన్నికల్లో కూడా అలానే ఫ్రంట్నే  ఉంటున్నారు.

వస్తున్నది వెనక నుంచి కదా. అంటారేమో.

వెనకనుంచైనా ఫ్రంటే కదా

 మొత్తానికి ఫ్రంట్కు ఓ కొత్త  పేరు కావాలి.

అన్నగారెప్పుడో భారతదేశం అన్న పార్టీని జాతీయస్థాయిలో పెట్టాలనుకున్నారు.

ఆ పేరు మూడో ఫ్రంట్కు పెడితే..

భారత ఫ్రంట్. మావగారి ఆత్మ శాంతిస్తుంది.అత్త గారు ఆగ్రహం పోతుంది.

హరిక్రిష్ణ ఆసుపత్రి నుంచి కులాసాగా ఇంటికి వెళ్లిపోతాడు.

పురందేశ్వరి కూడా యార్లగడ్డతో ప్రెస్ మీట్లు పెట్టించదు.

అంతా అన్నగారి కుటుంబం అని పాట పాడుకోవచ్చు.

ఏమంటారు బాబుగారు..


Tuesday, 4 September 2012

మళ్లీ చంద్రబాబు లాంటి బకరా కోసం...

దేశం ఐక్యత గురించి ఆలోచిస్తాం.

జాతీయ థ్రుక్పథం  మా వైఖరి

కుహానా లౌకికవాదానికి మేం దూరం

ఇలా చాలా డప్పాలు కొడుతూ ఉంటుంది బీజేపీ

అలాంటి బీజేపీ తెలంగాణపై అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే
 ఓట్ల కోసం ఆ పార్టీ  ఏ స్థాయికి దిగజారిపోతుందో అర్థమవుతోంది.

అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ ఇస్తుందట.

ఢిల్లీలో ఈ రోజు సుష్మా చెబుతోంది.

మూడు నెలల్లో ఓ రాష్ర్టాన్ని ముక్కలు చేయడం ఎంత సులువైపోయిందో చూడండి.

సుష్మా స్వరాజ్ జాతీయనేత. ఆమెపట్ల చాలా గౌరవముంది ప్రజల్లో

అలాంటి నేత కాస్త దూరద్రుష్టితో వ్యవహరిస్తుందని,, వాస్తవాలు తెలుసుకొని...

కాస్త లోతైన అవగాహనతో మాట్లాడుతుందని ఆశిస్తాం.

కానీ మూడు నెలల్లో ముక్కల్లాంటి

మాటలు ఆమె స్థాయిని దిగజార్చేవే.

ఒక్క బీజేపీయే కాదు.. తెలంగాణపై అన్ని పార్టీలు నాటకాలు ఆడుతున్నాయనుకోండి.

కానీ బీజేపీ నాటకం కాస్త భిన్నం

ఎలాగూ అధికారంలోకి రాదు.

వచ్చినా ఇతర పార్టీల మద్దతుతోనే

మద్దతిచ్చిన పార్టీల్లో కొన్ని ఎలానూ వ్యతిరేకిస్తాయి.

కాబట్టి  చంద్రబాబు అడ్డు తగిలాడని చెప్పుకుని
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టినట్లు..
మళ్లీ అధికారంలోకి రాగానే మరో బాబో రావో పేరు వెతుక్కుంటుంది

మా చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేస్తుంది

 జరిగేది ఇదే. కానీ జరగని విషయాన్ని ప్రజలకు చెబుతోంది.

ఆశలు కల్పిస్తోంది. ఆ ఆశలను పునాదిగా చేసుకొని రాజకీయంగా తెలంగాణలో

పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది.







Monday, 3 September 2012

సచిన్ డిక్లరేషన్

వీలైనంత ఎక్కువ కాలం కుర్చీని పట్టుకుని,పదవిని పట్టుకొని వేలాడాలని రాజకీయ నాయకులనుకుంటారు. సహజం. కానీ క్రికెటర్లూ అలా అనుకుంటే..



ఇపుడు  డిక్లరేషన్ కాలంనడుస్తోంది. బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్.చివరికి చనిపోయిన సాయిబాబా కూడా   ఓ డిక్లరేషన్ ప్రకటించారు. సచిన్ కూడా తొందరగా డిక్లరేషన్ ప్రకటిస్తే బాగుండు.






Tuesday, 21 August 2012

గతుకుల ప్రయాణం

సాఫీగా సాగుతున్నప్పుడు ఏమీ గుర్తుకు రావు.
గతుకుల ప్రయాణం మొదలైనపుడే గతం గిర్రున తిరుగుతుంది.


Saturday, 11 August 2012

లేకపోతే మనిసికి గొడ్డుకి తేడా ఏటుంటాది

ఏవో చెత్త ఆలోచనలు  నా మెదడు చుట్టూ ముసురుకుంటున్నాయి. వాటిని తరిమేయలేక. కీ బోర్డుపై చేతులు కదుపుతున్నాను. అయినా నెగిటివ్ ఆలోచనలు వీడడం లేదు. పాజిటవ్ గా ఉండడమెలా అంటూ చాలా పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాల సారాంశం ఎందుకో వర్కవుట్ అవ్వడం లేదు. ట్రై చేస్తున్నా. వాటి మేజిక్ పనిచేయాలంటే ఇంకో రోజు గడవాలేమో. అయినా కాలం వివిధ సందర్భాల్లో మన మీద వేసే ముద్రల్ని పుస్తకాలతో చెరిపేద్దామనుకోవడం పారపాటేమో. ఏడ్వాలనుకున్నప్పుడు ఏడుస్తాం గానీ  నవ్వలేం. నవ్వాలనుకున్నప్పుడు  ఎంత గింజుకున్నా ఏడుపురాదు.  కష్టమొస్తే బాధపడాలి  ఆనందం వస్తే గంతులేయాలి.  పుస్తకాలు చదివాం కాబట్టి ఏడుపొచ్చినప్పడు నవ్వమంటే  నవ్వలేం. పిరికితనం ఆవహించిన వేళ ధైర్యంగానూ  ఉండలేం. తప్పదు కొన్ని నిమిషాలైనా,  కొన్ని క్షణాలైనా,  భావోద్వేగాలు మనతో బాస్కెట్బాల్ ఆడుకుంటాయి.  లేకపోతే  ముత్యాల ముగ్గులో రావుగోపాల్రావన్నట్లు మనిసికి గొడ్డుకి తేడా ఏముంటుంది.

కట్టూ కాపీ... జకారియా

కట్టూ కాపీ చేశాడు. కంట్రోల్ డిలీట్ కొట్టారు.
పాపం ఫరీద్ జకారియా. కాపీ కొట్టినందుకు టైమ్స్ నెట్ వర్క్  అతణ్ని డిబారు చేసింది.   ఏప్రిల్లో జకారియా ఓ ఆర్టికల్ రాశాడు. అందులో  కొన్ని పేరాలు అంతకుముందు న్యూయార్కర్లో  వచ్చిన ఓ వ్యాసంలోనివట. ఈ మక్కీకి మక్కీ కాపీ యవ్వారాన్ని ఒక బ్లాగరు వెలుగులోకి తెచ్చారు. ఆ వెలుగు దావానాలంగా మారి.. వయా పేస్ బుక్కు, ట్వీటర్లాంటి సామాజిక సైట్ల గుండా సంచరించి జకారియా ఉద్యోగానికి స్పాట్  పెట్టింది.

అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో గొప్ప జర్నలిస్టుల్లో ఒకరిగా  జకారియాకు పేరుంది. అమెరికాలో ప్రభావశీలమైన వ్యక్తుల్లో అతను ఒకరు. 2010లో టైమ్స్ మ్యాగజైనుకి ఎడిటరుగా కూడా అతను పనిచేసినట్టుంది. అలాంటి వ్యక్తి .. వేరే వ్యాసం నుంచి పేరాలకి, పేరాలు సంగ్రహించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. జరిగిన దానికి వెంటనే  జకారియా క్షమాపణ చెప్పి..  పొరపాటైందని లెంపలేసుకున్నా..  టైమ్ కనికరించలేదు. దొబ్బేయ్ అంది. కట్టూ పేస్తూ చేస్తే ఇంత ఉద్యోగం ఫట్టైపోతుందని ఊహించలేదు జకారియా. ఇంతకుముందు కూడా జకారియాపై ఇలాంటి ఆరోపణలొచ్చాయి. 

ఇక అమెరికా నుంచి ఆంధ్రప్రదేశానికి వద్దాం. మన దగ్గరా జకారియాలున్నారు. కట్టూ కాపీ కాకపోయినా, ఇంటర్నెట్లో వచ్చిన వ్యాసాలను అనువాదం చేసి.. అవి తమ సొంత స్రుజనగా చెప్పుకునేవాళ్లు చానా మంది ఉన్నారు.
అంతెందుకు బ్లాగుల్లో రాసిన విషయాలను ఆ బ్లాగరును సంప్రదించకుండా వాడిన సందర్భాలు కోకొల్లలు. అయినా జకారియాలా ఎవరికీ పదవులు పోవు. దటీజ్ ఇండియా.

ఊకొడతారా, ఉత్తిదే అంటారా

కొందరికి కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులను దాటి పనిచేయరు. దాటాలంటే  భయం. అందుకే  జీవితమంతా ఆ పరిమితుల్లోపే గడిపేస్తారు. ఇంకొందరుంటారు.వీరికీ పరిమితులుంటాయి. కాని వీరు తమ పరిమితులను తామే నిర్దేశించుకుంటారు. వాటి పరిథిని కూడా తమకు ఇష్టమొచ్చిన రీతిలో మార్చుకుంటూ ఉంటారు.  వీరికి భయముండదు. రేపటి గురించి ఆలోచనా ఉండదు. ముందుకు దూసుకుపోవడమే తెలుసు. కష్టమొస్తే ఓర్చుకునే మానసిక శక్తి, ఆనందమొస్తే ఆస్వాదించే గుణముంటాయి వీరిలో. ఇలాంటి వాళ్లే జీవితంలో విజయవంతమవుతారు. పరిమితుల చట్రంలో సంచరించేవాళ్లు, వారెంత మేధావులైనా సరే, విజయానికి ఆమడదూరంలోనే నిలిచిపోతారు.

ఇది ఒక మిత్రుడి చెప్పిన సుభాషితం

ఏకీభవించాలా.. వద్దా.. ఎందుకో మిత్రుడి చెప్పిన మాటల్లో ఎన్నో ప్రశ్నలు కనిపించాయి నాకు, మరి మీకో

Thursday, 26 July 2012

నిజం.. నిప్పు.. ఏబీకే


Review: Truths about Telangana

  
The intriguing map of the country on the cover draws you to flip the pages and more so the title ‘Telanganame Andhra Pradesh’, a hot and happening topic to all those living in this state. When journalists turn authors, there is an added advantage: it is highly readable. The chronicle of events and narrative is never meandering; it is crisp, objectively analytical with a dash of history, a sprinkling of current affairs, factual to the core and though the personal view does peep in here and there, it does not adhere to any single political entity. This in a nutshell, is the nature of the book penned by veteran journalist ABK Prasad.
Coming to the contents, the author has judiciously chosen to portray the fight for identity of the Telugu people as a mini war of independence to break free from the British or Nizam yoke which began nearly 63 years ago. This is to convey that the linguistic division has been done and the patriots were none other than the leaders who were born and brought up in the Telangana region like Sri Madapati Hanumantha Rao, Suravaram, etc.
The pointer is towards the present ‘politically-motivated’, separate Telangana movement which is actually ‘meaningless’ being spear-headed by a settler from ‘Bobbili’ geographically located in coastal Andhra.The chapters are interlaced with lovely poetry from the great revolutionary poet Sri Sri, who implored the people of Telugu land to stand united and eschew in-fighting lest one of the neighbours swallow us up. These little verses more than tell half the story and make for an interesting read. The rest are eye-openers to non-journalists who are blinded by the so-called ‘reforms’ and ‘renaissance’ of our state under previous heads of state.
For instance, the reference to World Bank recommendations, to open up the economy (a Central government decision) is what contributed to unemployment of the non-IT segment in the state and not another set of Telugu brothers from regions other than Telangana, as is being touted by the so-called leadership at the helm of the independent Telangana movement, says the author with clarity. The reference to soil and land placement in the Telangana region, with a few exceptions, mirrors the lack of sumptuous agriculture and dependence on lift irrigation, a costly alternative. Hence, half the region reels under the dry belt and is no comparison to the wet land or delta of the coastal areas.
The author deplores the divisive tactics of the politicians in igniting regional conflicts among Telugu people. As for the allegations on ‘Andhra’ leaders usurping or owning immovable properties in other states, the author carefully unveils the complainant’s own ‘deeds of profit’ and the theory of expansion.
Despite certain home truths, there is an open attempt to hit the nail on the head, by constantly reminding all those vociferous pro-Telangana warriors that Andhra Pradesh as it stands today is nothing but the land of Telugu people which in a single word is called Telangana.
Hence this book is an attempt to awaken the rationale in people to realize and avoid falling prey to hideous political plans which have so far cost both lives and resources.
RANEE KUMAR
Telanganame Andhra Pradesh
Author: ABK Prasad
Price: Rs. 80
For copies: Visalandra, Prajasakthi and Navodaya book houses

Sunday, 22 July 2012

ఎంత గొప్ప ఇంటర్వూ అది

తారా చౌదరీతో రాధాక్రిష్టుడి ఇంటర్వూ యూట్యూబ్లో చూశాను. ఇంటర్వూ చాలా బాగుంది. ఎంత బాగుందంటే మాట్లలో చెప్పడం కష్టం. నిజంగా చానా బాగుంది. ఎవరూ ఇలాంటి ఇంటర్వ్యూ చేయలేరు.  రాధాక్రిష్ణ గారికే మాత్రమే సాధ్యమయ్యే ఇంటర్వూ.  పదు నైన ప్రశ్నలతో, ఎక్కడా ఇసుమంతైనా మొహమాటానికి పోకుండా సూటిగా, స్పష్టంగా, సుత్తి లేకుండా పాయింట్ టూ పాయింట్ అడుగుతూ సమాధానం రాబట్టిన విధానముంది చూశారూ.. నభూతో. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తారా చౌదరీతో ఇంటర్వూ ప్రపంచ జర్నలిజం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మీ సంబడం సంతకెళ్లా

రాష్ట్రపతి పదవనేది రాజకీయాలకు అతీతం. కానీకాంగ్రెస్ వారు అలా భావించడం లేదు. ఏ పీసీసీ అధ్యక్ష పదవి కిందో.. సీడబ్ల్యూసీ పదవి కిందో భావిస్తున్నట్టున్నారు. అందుకే దాదా ఎన్నిక కాగానే దేశవ్యాప్తంగా సంబడాలు జరుపుకున్నారు. మన అద్రుష్టమేంటంటే ఎన్నిక కాగానే ప్రణబ్.. సోనియా గాంధీ ఇంటికి వెళ్లలేదు.

Saturday, 21 July 2012

ఏటి సిత్రం.. ఈగ నచ్చనేదట

చిత్రం.. ఈగనచ్చకపోవడమేంటి . రాజమౌళి తీసిన సినిమా. నచ్చకపోతే బాగుండదు. అందరికీ నచ్చింది. నీకు నచ్చకపోవడమేంటి. నీలోని ఏదో లోపముంది. అయినా బయట ఎక్కడా అనకు. నచ్చకపోయినా అదిరిపోయిందని చెప్పు. లేకపోతే వెర్రి నాగమ్మ అనుకుంటారు. అర్థమైందా

Saturday, 9 June 2012

నోను సేంచనైంది

వద్దే మరుగు దొడ్డి కట్టొద్దే అప్పులు పాలై ... పోతామే. అంటే ఇనిపించుకోనేదు మా యింటావిడ. సివరికి దాని పోరుపడ్నేక   నోను చేసైనా కట్టేద్దామని నోను కోసం బేంక్ కి యెళ్లా.  నోనెంత కావాలా...  అని అడిగినాడు ఆపీసరు. 50 నచ్చలని చెప్పినా. గుండెలు బాదేసుకున్నాడు లబలబా లబలబా మని. ఏటి దొడ్డికి 50 నచ్చలా..  మతీగితీ ఉండే మాటాడుతున్నావా.. ఆసికాలడుతున్నావేటి అంటూ కలబడిపోనాడు. చేతిలో ఉన్న  బంట్రోతు చేత  బయటికి తోయించేసినాడు.   నానొదలతానా. తిక్క ముండా కొడుకుని. 50 నచ్చల కోసం  బేంక్ బేంక్కీ కాళ్ళరిగేలా తిరిగాను.నోనెక్కడా దొరక్నేదు. మరుగుదొడ్డికి 50 నచ్చలా... అని   గుండెలు లబలబా బాదేసుకున్నోళ్లే కనిపించినారు గానీ..  ఏటి కోట్లడిగానాడా, బెంజ్ కారడిగినాడా.. అని దయ తలచిన  ధర్మ పెబువూ ఒక్కడు అవుపడ్నేదు.  సివరికి ఈ వార్త తెల్లారి పేపర్లో వచ్చింది. నోను  సేంచనైంది.

మా దొడ్డిలో ఈ వార్తకు పటం కట్టి   పూజలు కూడా సేత్తన్నాం నాను, మా యింటావిడ



Rs. 30 lakh spent to renovate Planning Commission hq. toilets

SPECIAL CORRESPONDENT
SHARE  ·   COMMENT   ·   PRINT   ·   T+  
Commission says the toilets are meant for shared public use
A day after a Right to Information query revealed that the Planning Commission had splurged over Rs. 30 lakh on renovating toilets at its headquarters in Delhi, the Commission disputed that it was wasteful expenditure. The Commission said the amount was spent on a set of six “toilet blocks” with multiple seats and facilities for the differently-abled. It also described the renovation as “routine maintenance,” required in an old building having an antiquated plumbing system
The luxury toilets, accessible via a set of smart cards, attracted criticism, with the Opposition Bharatiya Janata Party questioning the indulgence at a time when the government was supposedly on an austerity mission. The expenditure is also thought to be ironic in view of the Commission's controversial position that it was possible for an individual to live on a daily earning of Rs.32 in urban areas and Rs. 26 in rural areas. The Commission admitted to releasing the RTI information but said the press ought to have cross-checked the details with it. The information released by the Commission did not specify the number of toilets but said 60 smart cards had been distributed to users belonging to different posts such as “senior adviser, advisers, director, upper division clerks.”
In its statement, however, the Commission said the toilets were meant for shared public use and had been necessitated because of the growing number of visitors to its office. An access-control system had been attempted and given up, it said.
“The toilets being repaired or renovated are public toilet blocks, and not private toilets for senior officials or members. While the amount of Rs. 30 lakh being mentioned is correct, an impression is being created that this has been spent on two toilets. This is totally false, because these toilet blocks have multiple seats in addition to separate facility for the differently-abled. Each of these blocks can be simultaneously used by approximately 10 people.”
The Commission said the first three blocks were completed earlier this year and the other three would be ready later in the year: “These toilet blocks are meant for shared use and are all being renovated to the same standard. Because there have been instances of pilferages of newly constructed toilets, an access-control system was initially tried, but not found feasible. Yojana Bhavan is an important public building and must have the essential facilities. The costing and execution of works is not done by the Planning Commission, but by the CPWD, which is the authorised government agency to do the same. The entire work is being done within the budgetary allocation and following the prescribed procedure.”